Site icon NTV Telugu

Bussiness Idea : అదిరిపోయే బిజినెస్.. కేవలం రూ.15 వేలు పెడితే చాలు.. రోజుకు రూ.4 వేలు మీ సొంతం..

Banana

Banana

తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందేలా ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నారా? అయితే మీకు చాలా ఆఫ్షన్స్ అందుబాటులో ఉన్నాయి.. అందులో 3 వేల నుంచి 50 వేల పెట్టుబడితో చేసే బిజినెస్ లు చాలానే ఉన్నాయి.. ఇప్పుడు అలాంటి ఓ బెస్ట్‌ ఐడియాను తీసుకొచ్చాం. కేవలం 15 వేల పెట్టుబడితో రోజుకు రూ. 4 వేలు సంపాదించవచ్చు. ఇంతకీ ఆ బిజినెస్‌ ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఆ బిజినెస్ అరటి పొడి తయారీ బిజినెస్.. అరటి పొడిని తయారు చేయడానికి మీకు 2 యంత్రాలు అవసరం. మొదటి యంత్రం అరటిని పొడిగా చేస్తుంది. రెండవది మిక్సర్ యంత్రం. మీరు ఈ యంత్రాలను ఆన్‌లైన్‌లో లేదా మీకు సమీపంలోని ఏదైనా దుకాణం నుంచి కొనుగోలు చేయవచ్చు.. ఈ బిజినెస్ ను మొదలు పెట్టడానికి మీరు ముందుగా అరటి కాయలను సేకరించాలి.. మీరు ఈ అరటిని సోడియం హైపోక్లోరైట్‌తో శుభ్రం చేయాలి. ఇప్పుడు వాటిని పీల్ చేసి వెంటనే సిట్రిక్ యాసిడ్ ద్రావణంలో వేసి 5 నిమిషాలు అలాగే ఉంచాల్సి ఉంటుది. దీని తర్వాత అరటిపండును చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. తర్వాత ఓవెన్‌లో ముక్కలను ఉంచండి. 60° C వద్ద దానికి 24 గంటలు ఉంచండి. దీంతో అరటిపండు ముక్కలు పూర్తిగా ఆరిపోతాయి. ఆ తర్వాత వాటిని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా పొడి వచ్చేవరకు గ్రైండ్ చేస్తూ ఉండండి..

ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టడానికి మీకు 15 వేల వరకు ఖర్చు అవుతుంది.. అరటిపండుతో తయారుచేసిన పొడిని పాలిథిన్ లేదా గాజు సీసాలో నింపి ఉంచుకోవచ్చు. అరటిపండుతో తయారు చేసిన 1 కిలోల పొడిని మార్కెట్‌లో రూ.800 నుంచి రూ.1000 వరకు సులభంగా విక్రయించవచ్చు. రోజూ 5 కిలోల అరటిపండు పొడి చేస్తే రూ.3500 నుంచి రూ.4500 వరకు లాభం పొందవచ్చు.. అరటి పొడి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది బీపీని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది జీర్ణ శక్తిని బలోపేతం చేయడానికి కూడా ఉపయోగించబడుతుంది. అంతే కాకుండా, ఇది మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది.. అందుకే మార్కెట్ లో ఈ పొడికి డిమాండ్ కూడా ఎక్కువే.. ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టడానికి ముందుగా మార్కెటింగ్ కూడా చూసుకోవాలి.. మార్కెట్ లో డిమాండ్ పెరిగే కొద్ది మీరు లాభాలను పొందవచ్చు..

Exit mobile version