Bussiness Idea : అదిరిపోయే బిజినెస్.. కేవలం రూ.15 వేలు పెడితే చాలు.. రోజుకు రూ.4 వేలు మీ సొంతం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందేలా ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నారా? అయితే మీకు చాలా ఆఫ్షన్స్ అందుబాటులో ఉన్నాయి.. అందులో 3 వేల నుంచి 50 వేల పెట్టుబడితో చేసే బిజినెస్ లు చాలానే ఉన్నాయి.. ఇప్పుడు అలాంటి ఓ బెస్ట్ ఐడియాను తీసుకొచ్చాం. కేవలం 15 వేల పెట్టుబడితో రోజుకు రూ. 4 వేలు సంపాదించవచ్చు. ఇంతకీ ఆ బిజినెస్ ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఆ బిజినెస్ అరటి పొడి తయారీ బిజినెస్.. అరటి పొడిని తయారు చేయడానికి మీకు 2 యంత్రాలు అవసరం. మొదటి యంత్రం అరటిని పొడిగా చేస్తుంది. రెండవది మిక్సర్ యంత్రం. మీరు ఈ యంత్రాలను ఆన్‌లైన్‌లో లేదా మీకు సమీపంలోని ఏదైనా దుకాణం నుంచి కొనుగోలు చేయవచ్చు.. ఈ బిజినెస్ ను మొదలు పెట్టడానికి మీరు ముందుగా అరటి కాయలను సేకరించాలి.. మీరు ఈ అరటిని సోడియం హైపోక్లోరైట్‌తో శుభ్రం చేయాలి. ఇప్పుడు వాటిని పీల్ చేసి వెంటనే సిట్రిక్ యాసిడ్ ద్రావణంలో వేసి 5 నిమిషాలు అలాగే ఉంచాల్సి ఉంటుది. దీని తర్వాత అరటిపండును చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. తర్వాత ఓవెన్‌లో ముక్కలను ఉంచండి. 60° C వద్ద దానికి 24 గంటలు ఉంచండి. దీంతో అరటిపండు ముక్కలు పూర్తిగా ఆరిపోతాయి. ఆ తర్వాత వాటిని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా పొడి వచ్చేవరకు గ్రైండ్ చేస్తూ ఉండండి..
Also Read
- FSSAI Action Against Dabur: 145 ఏళ్ల డాబర్‌కు షాక్.. ఎఫ్ఎస్ఎస్ఏఐ కఠిన చర్యలు..! కుప్పకూలిన షేర్లు..
- FSSAI: మందు బాబులకు బిగ్ అలర్ట్.. ఈ విస్కీ, రమ్ బాటిళ్లు ఇక దొరకవా?
- ఒకే రీఛార్జ్‌లో Wi-Fi, TV, OTT.. నెలకు రూ.400 నుంచే..! Jio నుంచి కొత్త 3-in-1 హోమ్ ప్లాన్స్ అదుర్స్..
- కేంద్రం కీలక నిర్ణయం.. డీజిల్, పెట్రోల్, ATF ఎగుమతులపై భారీగా Windfall Tax పెంపు..!
ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టడానికి మీకు 15 వేల వరకు ఖర్చు అవుతుంది.. అరటిపండుతో తయారుచేసిన పొడిని పాలిథిన్ లేదా గాజు సీసాలో నింపి ఉంచుకోవచ్చు. అరటిపండుతో తయారు చేసిన 1 కిలోల పొడిని మార్కెట్‌లో రూ.800 నుంచి రూ.1000 వరకు సులభంగా విక్రయించవచ్చు. రోజూ 5 కిలోల అరటిపండు పొడి చేస్తే రూ.3500 నుంచి రూ.4500 వరకు లాభం పొందవచ్చు.. అరటి పొడి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది బీపీని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది జీర్ణ శక్తిని బలోపేతం చేయడానికి కూడా ఉపయోగించబడుతుంది. అంతే కాకుండా, ఇది మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది.. అందుకే మార్కెట్ లో ఈ పొడికి డిమాండ్ కూడా ఎక్కువే.. ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టడానికి ముందుగా మార్కెటింగ్ కూడా చూసుకోవాలి.. మార్కెట్ లో డిమాండ్ పెరిగే కొద్ది మీరు లాభాలను పొందవచ్చు..
తాజావార్తలు
-
Pradeep Rawat : ఛత్రపతి, సై సినిమాల విలన్ మృతి?
-
Minister Narayana: సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. అమరావతికి కొత్త ఊపు
-
Udhayanidhi Stalin: ఉదయనిధి స్టాలిన్ విడుదల.. కార్యకర్తలు సంబరాలు
-
Country Name Changed: తమ దేశం పేరు మార్చుకున్న ‘నౌరు’.. కొత్త పేరు ఇదే..
-
Discount On iPhone: యాపిల్ ప్రియులకు ఫ్లిప్‌కార్ట్ అద్భుత ఆఫర్స్.. ఆ ఫోన్‌పై రూ.17 వేలు తగ్గింపు..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!