యువత వ్యవసాయం చెయ్యడం వైపు మొగ్గు చూపిస్తున్నారు.. ఈ మధ్య ఎక్కువ మంది అరుదైన పంటలను పండిస్తూ అధిక లాభాలాను పొందుతూన్నాడు.. ఆదాయాన్ని ఇచ్చే పంటల విషయానికొస్తే స్ట్రాబెర్రీ పంట మంచి ఆదాయం..తక్కువ పెట్టుబడి పెడితే లక్షల్లో ఆదాయం వస్తుంది..ఈ రైతు తాను ఎంతో కాలంగా పండిస్తున్న గోధుమ పంటకు బదులు స్ట్రాబెర్రీని సాగు చేశాడు.. నెలకు లక్షల ఆదాయాన్ని పొందుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు రైతు..
వివరాల్లోకి వెళితే.. జమ్మూ కాశ్మిర్ కు చెందిన రైతు రష్ పాల్ సేంద్రీయ పద్ధతిలో స్ట్రాబెర్రీలను పండిస్తూ నెలకు లక్షల్లో సంపాదిస్తున్నాడు.కూహ్ గ్రామంలో చాలా మంది రైులు సాంప్రదాయ పంటలైన గోధుమలు, మొక్కజొన్న పంటలను పండిస్తారు.అందరిలాగే రష్ పాల్ సింగ్ కూడా గోధుమలు పండించే వాడు.. ఎంత కష్టపడిన కూడా అతనికి ఖర్చులకు డబ్బులు మిగలలేదు.. స్ట్రాబెర్రీ పంట వైపు మళ్లాడు. పంట వేయాలని అయితే నిర్ణయించుకున్నాడు కానీ లాభాలు వస్తాయో లేదో అనే అనుమానం మాత్రం ఉండేది. కానీ ముందుకే వెళ్లాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. అదే విధంగా ఆధునాతన పద్ధతులతో పండించి సక్సెస్ అయ్యాడు..
10 మార్ల భూమిలో పండించిన పంట నుండి సుమారు రూ. 40 వేలు సంపాదించినట్లు చెప్పారు రష్ పాల్. తన స్ట్రాబెర్రీ పంట విజయవంతమైందని తెలిపాడు. క్రమంగా తన పంట విస్తీర్ణాన్ని పెంచాలని నిర్ణయించుకున్నాడు. తన కొడుకు తను వేరే పని లేకుండా ఇదే పనిలో ఉన్నారు. ఇప్పుడు అతనికి లక్షలు లాభం వస్తుంది.. చుట్టూ పక్కల రైతులకు అతను అన్ని విధానాలను చెబుతూ పంటపై అవగాహన కల్పిస్తున్నాడు.. మొత్తానికి అతని ఒక్క అడుగు వేల మంది రైతులను ముందుకు నడిపిస్తుంది..