NTV Telugu Site icon

Business Headlines: 60 వేల కోట్ల ఫండ్‌ రైజింగ్‌ చేయనున్న టాటా గ్రూప్‌ కంపెనీలు

Business Headlines

Business Headlines

Business Headlines: టాటా గ్రూప్‌ సంస్థలు 60 వేల కోట్ల రూపాయల నిధులను సమీకరించనున్నాయి. ఈ మేరకు ప్రధాన బ్యాంకులతోపాటు ఈక్విటీ ఇన్వెస్టర్లతో చర్చలు జరుపుతున్నాయి. విద్యుత్‌ వాహనాలు మరియు పునరుత్పాదక శక్తి రంగాల్లో మూలధన వ్యయ ప్రణాళికల అమలు కోసం ఈ కొత్త పెట్టుబడులను ఖర్చు పెట్టనున్నాయి. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన కంపెనీలు ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికిల్స్ ఉత్పత్తిపై ఫోకస్ పెడుతుండటంతో టాటా కూడా ఈ బాటపట్టింది.

76 మిలియన్‌ టన్నుల బొగ్గు దిగుమతి

స్థానిక విద్యుదుత్పత్తి కేంద్రాల్లో నెలకొన్న తీవ్ర కొరతను ఎదుర్కోవటానికి మన దేశం ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు 76 మిలియన్‌ టన్నుల బొగ్గును విదేశాల నుంచి దిగుమతి చేసుకోనుంది. దీంత్‌ దేశీయంగా కరెంట్‌ బిల్లులు 50 పైసల నుంచి 80 పైసల వరకు పెరగనున్నాయి.

యూరప్‌లో వడ్డీ రేట్ల పెంపు

యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ 11 ఏళ్ల విరామం తర్వాత తొలిసారిగా వడ్డీ రేట్లను 50 బేసిస్‌ పాయింట్లు పెంచింది. ద్రవ్యోల్బణ కట్టడి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. తద్వారా తమకు ఆర్థిక వృద్ధి కన్నా ధరల పెరుగుదలను అడ్డుకోవటమే ప్రధానమని స్పష్టం చేసింది. దీంతో యూరో మారకం విలువ, ప్రభుత్వ బాండ్ల అమ్మకాలు, బ్యాంకుల షేర్లు పెరిగాయి.

read more: Great and Good News: అరుణాచల్‌ప్రదేశ్‌కే కాదు.. దేశం మొత్తానికీ గ్రేట్‌ న్యూస్‌, గుడ్‌ న్యూస్‌

27 వేల కోట్లు దాటనున్న ‘ఆటో మార్కెట్‌’

ఆర్థిక వ్యవస్థ ఊపందుకోవటం, వాహన ఉత్పత్తి కొత్త రికార్డును నమోదు చేయటంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో తయారీ రంగ వృద్ధిని ఆటోమొబైల్‌ విభాగం మరింత వేగవంతం చేయనుంది. మూలధన వ్యయం 27 వేల కోట్ల రూపాయలు దాటనుంది. అంటే ఈ సెక్టార్‌ గ్రోత్‌ 24 శాతం పెరగనుంది.

జీడీపీ అంచనాని తగ్గించిన ఏడీబీ

ఏసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏడీబీ).. ఇండియా స్థూల దేశీయోత్పత్తి అంచనాని 7 పాయింట్‌ 5 శాతం నుంచి 7 పాయింట్‌ 2 శాతానికి తగ్గించింది. అధిక ద్రవ్యోల్బణ పరిస్థితులతోపాటు ఆర్బీఐ అనుసరిస్తున్న కఠినమైన ద్రవ్య విధానాల వల్లే జీడీపీ అంచనాలను తగ్గించాల్సి వచ్చినట్లు పేర్కొంది.