NTV Telugu Site icon

Business Headlines: భూటాన్‌ టూర్‌ భారమే. మనోళ్లకి కాస్త నయం. వేరే దేశాలకు మరీ..

Business Headlines

Business Headlines

Business Headlines: 82కి పడిపోనున్న రూపాయి

డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ త్వరలోనే 82 రూపాయలకు పడిపోనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాణిజ్య లోటు, అమెరికాలో వడ్డీ రేట్లు పెరగనుండటమే దీనికి కారణమని చెబుతున్నారు. రేపు, ఎల్లుండి నిర్వహించనున్న అమెరికా ఫెడరల్‌ బ్యాంక్‌ సమావేశంలో వడ్డీ రేట్లను 50 నుంచి 75 బేసిస్‌ పాయింట్ల వరకు పెంచే అవకాశాలున్నాయని చెబుతున్నారు.

ఇన్ఫోసిస్‌ లాభం రూ.5360 కోట్లు

సాఫ్ట్‌వేర్‌ దిగ్గజ సంస్థల్లో ఒకటైన ఇన్ఫోసిస్‌ ఈ ఆర్థిక సంవత్సరంలోని మొదటి మూడు నెలల్లో విశేషంగా రాణించింది. 5 వేల 360 కోట్ల రూపాయల నికర లాభాన్ని ఆర్జించింది. దీంతోపాటు భారీ ప్రాజెక్టులను సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ ఏడాది అదనంగా 16 శాతం వరకు ప్రాఫిట్స్‌ రావొచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపింది.

read more: Komatireddy: కోమటిరెడ్డిలో కన్ఫ్యూజన్. ఎన్నాళ్లిలా?..

ఎల్‌&టీ నుంచి ఎడెల్‌వీస్‌కి

ఇంజనీరింగ్‌ రంగంలో పేరొందిన సంస్థ లార్సన్‌ అండ్‌ టూబ్రో తన అధీనంలోని 8 రోడ్‌ ప్రాజెక్టులను, ఒక ట్రాన్స్‌మిషన్‌ ప్రాజెక్టును ఎడెల్‌వీస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీకి విక్రయిస్తోంది. ఈ ప్రాజెక్టుల విలువ 7 వేల కోట్ల రూపాయలు కావటం విశేషం. ఈ మేరకు రెండు సంస్థల మధ్య ఈ నెల మొదటి వారంలోనే ఒప్పందాలు కుదిరాయి. ఈ ఒప్పందాలకు నేషనల్‌ హైవేస్‌ అథారిటీ మరియు సెబీ అనుమతులు లభించాల్సి ఉంది.

తగ్గనున్న ఐటీ కొనుగోళ్లు

ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో ఈ ఏడాది మొబైల్‌ ఫోన్లు, ట్యాబ్లెట్లు, పర్సనల్‌ కంప్యూటర్ల కొనుగోళ్లు పడిపోయాయని ఐడీసీ తెలిపింది. వచ్చే ఏడాది మరింత తగ్గుతాయని తాజా నివేదికలో అంచనా వేసింది. వినియోగదారులు ఐటీ సంబంధిత ఖర్చులను తగ్గించుకుంటున్నారని పేర్కొంది. గత రెండేళ్లలో ఎక్కువ కంపెనీలు వర్క్‌ ఫ్రం హోం ఇవ్వటంతో చాలా మంది అప్పుడే కొన్నారని గుర్తుచేసింది. ఆర్థిక వ్యవస్థ మందగమనం మరో కారణమని అభిప్రాయపడింది.

పదేళ్లు 15 శాతమే పన్ను!

స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్ల స్థానంలో డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ ఎంటర్‌ప్రైజ్‌ అండ్‌ సర్వీస్‌ హబ్స్‌ను తీసుకొస్తున్న కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన బిల్లులో పన్నులు, ప్రోత్సాహకాలపై స్పష్టత ఇవ్వనుంది. ప్రత్యక్ష పన్నులను 2032 వరకు 15 శాతమే విధించే అవకాశం కనిపిస్తోంది. గ్రీన్‌ ఫీల్డ్‌ మరియు బ్రౌన్‌ ఫీల్డ్‌ పెట్టుబడులకు మాత్రమే ఈ నిబంధన విధించనున్నారు.

భూటాన్‌ టూర్‌ భారమే

భూటాన్‌ పర్యటన మరింత భారం కానుంది. ఆ దేశానికి వెళ్లేవాళ్లు ఇకపై భారీగా ఫీజు కట్టాలి. భారతీయులైతే రోజుకి 12 వందల రూపాయలు, ఇతర దేశాలవాళ్లయితే 16 వేలు చెల్లించాలి. ఎందుకంటే భూటాన్‌ ప్రభుత్వం సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌ ఫీజు పేరిట ఈ డబ్బు వసూలు చేయనుంది. ఈ మేరకు ఇటీవలే ప్రకటన చేసింది. రెండేళ్ల విరామం అనంతరం ఆ దేశ సరిహద్దులు సెప్టెంబర్‌ 23 నుంచి తెరచుకోనున్నాయి.