Business Flash: ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటోకి వరుసగా రెండో రోజూ ఎదురుదెబ్బ తగిలింది. రెండు రోజుల్లో కలిపి ఆ సంస్థ షేర్లు సుమారు 17 శాతం పడిపోయాయి. మొదటి రోజు కన్నా రెండో రోజు మరింత కనిష్టానికి పతనమయ్యాయి. ఏడాది లాకిన్ పీరియడ్ ముగియటంతో షేర్లు అమ్మకాల ఒత్తిణ్ని తట్టుకోలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు.. బ్రోకరేజ్ సంస్థ జెఫెరీస్ వాటాలు దూసుకుపోయాయి. ఒక షేర్ టార్గెట్ వ్యాల్యూ 100 రూపాయలు కాగా వాటి విలువ 125 శాతానికి పైగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంస్థను యాజమాన్యం మెరుగైన యూనిట్ ఎకనమిక్స్ వైపు శరవేగంగా నడిపిస్తుండటంతో షేర్లు బెస్ట్ పెర్ఫార్మెన్స్ చూపిస్తున్నాయి.
read also: AP IAS Officer: కొడుకుని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయించిన ఏపీ ఐఏఎస్ ఆఫీసర్
ఐటీ ఉద్యోగులు.. వలసలు..
ఈ ఆర్థిక సంవత్సరంలోని మొదటి మూడు నెలల్లో (క్యూ1లో) ఐటీ ఉద్యోగుల వలసలు జోరుగా సాగాయి. ఐటీ జెయింట్ సంస్థ అయిన ఇన్ఫోసిస్ నుంచి 28.4 శాతం ఎంప్లాయ్స్ జంప్ చేశారు. హెచ్‌సీఎల్ టెక్ నుంచి 23.8 శాతం మంది వెళ్లిపోగా విప్రోని 23.3 శాతం మంది ఉద్యోగులు వీడారు. టీసీఎస్‌కి 19.7% శాతం మంది టాటా చెప్పారు. ఎక్కువ మంది ఉద్యోగులు వదిలి వెళ్లిన సంస్థ ఇన్ఫోసిస్ అయినప్పటికీ కొత్త ఉద్యోగులు ఎక్కువ మంది చేరింది కూడా ఈ కంపెనీయే కావటం గమనార్హం. ఆ తర్వాతి స్థానాల్లో విప్రో, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్ ఉన్నాయి.
బయోలాజికల్-ఇ 1800 కోట్ల పెట్టుబడి
హైదరాబాద్‌కి చెందిన బయోలాజికల్-ఇ సంస్థ భారీ పెట్టుబడి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 3 జీనోమ్ వ్యాలీ యూనిట్ల ఏర్పాటు కోసం రూ.1800 కోట్లు ఖర్చు పెట్టనుంది. ఔషధాల తయారీ సామర్థ్యాన్ని 50 శాతం పెంచుకోవటంపై దృష్టిపెట్టింది. 14 బిలియన్ డోస్‌లు ఉత్పత్తి చేయాలని తాజాగా లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా స్పెషల్ జనరిక్ ఇంజక్షన్లను, బయోలాజికల్ ఏపీఐలతోపాటు వ్యాక్సిన్లను, ఫార్ములేషన్లను అందుబాటులోకి తేనుంది. మొత్తమ్మీద రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (ఆర్ అండ్ డీ) దిశగా ముందడుగు వేయనుంది.
స్టాక్ మార్కెట్ అప్‌డేట్
స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజూ నష్టాలతోనే ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 300 పాయింట్లు పడిపోయింది. నిఫ్టి 16,550 పాయింట్లకు దిగువన ట్రేడింగ్ అవుతోంది. ఫార్మా సంస్థల షేర్లు అగ్ర స్థానంలో కొనసాగాయి. బజాజ్ ఫిన్‌సర్వ్ స్టాక్స్ నాలుగు శాతం లాభపడ్డాయి. టాటా స్టీల్, రిలయెన్స్, ఎస్‌బీఐ తదితర సంస్థలు కూడా లాభాల బాటలో పయనించాయి. రూపాయి మారకం విలువ 79.77 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలు వెలువడటంతో మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి.
