NTV Telugu Site icon

Business Flash: టెస్లా అనూహ్య నిర్ణయం.. బిట్‌ కాయిన్‌లోని మేజర్‌ పెట్టుబడుల అమ్మకం

Business Flash

Business Flash

Business Flash: బిట్‌ కాయిన్‌లో భారీ పెట్టుబడి పెట్టినట్లు విద్యుత్‌ కార్ల తయారీ సంస్థ టెస్లా గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. 1.5 బిలియన్‌ డాలర్ల వరకు ఇన్వెస్ట్‌ చేసినట్లు అప్పట్లో పేర్కొంది. అయితే అందులోని అధిక వాటాను ప్రస్తుతం అమ్మేసినట్లు వెల్లడించింది. క్రిప్టో కరెన్సీలోని 75 శాతాన్ని విక్రయించామని తాజాగా తెలిపింది. బిట్‌కాయిన్‌లోని ఇన్వెస్ట్‌మెంట్లను అమ్మటంతో టెస్లాకు 936 మిలియన్‌ డాలర్లు వచ్చాయి. వీటితో సంప్రదాయ కరెన్సీని కొనుగోలు చేసింది. క్రిప్టో కరెన్సీకి డిమాండ్‌ పెరగటంతో బిట్‌కాయిన్‌లోని టెస్లా పెట్టుబడులు పెద్దఎత్తున పెరగటం గమనార్హం.

ఎస్‌ బ్యాంక్‌లోకి బిలియన్‌ డాలర్లు

ఎస్‌ బ్యాంక్‌లో ఒక బిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు కార్లైల్‌, అడ్వెంట్‌ సంస్థలు ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. ఎస్‌ బ్యాంక్‌ సీనియర్‌ మేనేజర్లతో చర్చోపచర్చలు జరుపుతున్నాయి. హాంకాంగ్‌ కంపెనీ అయిన కార్లైల్‌.. అడ్వెంట్‌తో కలిసి స్టేట్‌ బ్యాంక్‌ ఇండియా (ఎస్‌బీఐ), రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) తోనూ సంప్రదింపులు జరుపుతోంది. ఎస్‌ బ్యాంక్‌లో అతిపెద్ద వాటాదారు ఎస్‌బీఐ కావటంతో ఈ పెట్టుబడులకు గ్రీన్‌ సిగ్నల్‌ పొందటానికి ఆ బ్యాంక్‌ అనుమతి కూడా అవసరమే. ఇదిలాఉండగా ఈ పెట్టుబడి ప్రణాళికను దశలవారీగా అమలుచేయాలని భావిస్తున్నారు.

read more: Hyderabad: మసీదులో ఉచిత డయాలసిస్ కేంద్రం. ప్రపంచంలోనే తొలిసారి!

స్టాక్‌ మార్కెట్‌ అప్‌డేట్‌

ఈ వారాంతాన్ని స్టాక్‌ మార్కెట్లు ఇవాళ లాభాలతో ప్రారంభించాయి. సెన్సెక్స్‌ 100 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 16,600 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ అవుతోంది. ఆటోమొబైల్‌, పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకులకు అధిక లాభాలు వచ్చాయి. మిగతా రంగాల కన్నా వీటికి ఒక శాతం వరకు ఎక్కువే ప్రాఫిట్స్‌ రావటం విశేషం. లాభాలు ఆర్జించిన కంపెనీల లిస్టులో ప్రైవేట్‌ బ్యాంకులు, ఫైనాన్స్‌ సంస్థలు కూడా ఉన్నాయి. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌(బీఎస్‌ఈ)లో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌లకు 0.5 శాతం వరకు లాభం వచ్చింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో గుజరాత్‌ స్టేట్‌ ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌ (జీఎస్‌ఎఫ్‌సీ) నికర లాభం రెట్టింపు కానుందనే అంచనాల నేపథ్యంలో ఆ సంస్థ షేర్లు 8 శాతానికి పైగా లాభాలు సంపాదించాయి. 2022 ఆర్థిక సంవత్సరంలోని తొలి త్రైమాసికంలో జీఎస్‌ఎఫ్‌సీకి 137.76 కోట్లు మాత్రమే నికర లాభం రాగా 2023 ఆర్థిక సంవత్సరంలోని మొదటి మూడు నెలల్లో రెట్టింపు (355.83 కోట్ల) లాభం వస్తుందని అంచనా వేశారు.