Site icon NTV Telugu

Business Flash: దటీజ్‌ ఇండియన్ ఎకానమీ. కనిపించని ప్రపంచ అనిశ్చితుల ప్రభావం

Business Flash

Business Flash

Business Flash: 17 ఐపీఓలతో 6 బిలియన్‌ డాలర్లు

మన ఎకానమీ ఎంత బలోపేతంగా ఉందో చెప్పే సందర్భమిది. ఈ ఆర్థిక సంవత్సర ప్రథమార్ధంలోనే సంఘటిత రంగంలో 1149 ఒప్పందాలు కుదిరాయి. ఈ డీల్స్‌ వీటి విలువ ఏకంగా 104.3 బిలియన్‌ డాలర్లు కావటం విశేషం. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నా వాటి ప్రభావం మన ఆర్థిక వ్యవస్థ పైన ఏమాత్రం లేవనటానికి ఇదే నిదర్శనం. ఎందుకంటే కేవలం 17 ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫరింగ్స్‌(ఐపీఓ)తోనే 6 బిలియన్‌ డాలర్లు పోగయ్యాయి. తొలి ఆరు నెలల్లో ఇదే అత్యధిక ఇన్వెస్ట్‌మెంట్‌ కావటం గమనార్హం.

130 బిలియన్‌ డాలర్ల నష్టం

అమెరికా సోషల్‌ మీడియా కంపెనీలకు నిన్న శుక్రవారం ఒక్క రోజే 130 బిలియన్‌ డాలర్ల నష్టం వాటిల్లింది. ఆయా సంస్థల స్టాక్‌ మార్కెట్‌ విలువ భారీగా తగ్గింది. ట్విట్టర్‌, స్నాప్‌ కంపెనీల ఫలితాల వెల్లడి తర్వాత ఆన్‌లైన్‌ అడ్వర్టైజింగ్‌ ఆదాయాలపై మార్కెట్‌ ఇన్వెస్టర్లలో తీవ్ర ఆందోళన మొదలైంది. దీంతో ‘స్నాప్‌’ షేర్లు 39 శాతం పడిపోయాయి. 2020 మార్చి అనంతరం ఇదే కనిష్టం. ఆల్ఫాబేట్‌ స్టాక్స్‌ 5.6 శాతం క్షీణించాయి. గడచిన రెండేళ్లలో ఇదే అత్యధిక ‘ఒక్క రోజు నష్టం’ అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

read also: Governor Tamilisai: విమానంలో ప్రయాణికుడికి అస్వస్థత.. ప్రాథమిక చికిత్స చేసిన గవర్నర్

ఊపందుకున్న రియల్‌ ఎస్టేట్‌ రంగం

దేశవ్యాపంగా స్థిరాస్తి వ్యాపారం కొవిడ్ ప్రభావం నుంచి బాగానే కోలుకుంది. ఈ రంగంలోకి పెట్టుబడులు భారీఎత్తున వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలోని తొలి 6 నెలల్లోనే 3.4 బిలియన్‌ డాలర్ల ఇన్వెస్ట్‌మెంట్లు వచ్చాయి. గతేడాది చివరి మూడు నెలలు, ఈ ఏడాది మొదటి మూడు నెలలతో పోల్చితే ఇది 42 శాతం ఎక్కువ. 2021 ప్రథమార్ధం కన్నా 4 శాతం అధికం. సీబీఆర్‌ఈ ఇండియా మార్కెట్‌ మానిటర్‌ 2022 రెండో త్రైమాసికం నివేదికలో ఈ విషయాలను వెల్లడించింది. సీబీఆర్‌ఈ అంటే కోల్డ్‌వెల్‌ బ్యాంకర్‌ రిచర్డ్‌ ఎల్లిస్‌. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కమర్షియల్‌ రియల్‌ ఎస్టేట్‌ సర్వీసెస్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ. దీనికి మన దేశంలోనూ బ్రాంచ్‌ ఉంది.

Exit mobile version