Site icon NTV Telugu

Business Flash: ఫేస్‌బుక్‌ చరిత్రలో తొలిసారిగా ఎంత రెవెన్యూ తగ్గిందంటే?..

Business Flash

Business Flash

Business Flash: ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌ చరిత్రలోనే తొలిసారిగా రెవెన్యూ తగ్గింది. గతంలో ఎన్నడూ లేనంతగా ఒక శాతం ఆదాయం పడిపోయింది. ఒక శాతమంటే దాదాపు ఒక బిలియన్‌ డాలర్లతో సమానం. ఫేస్‌బుక్‌ రెవెన్యూ గత (2020-21) ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంతో పోల్చితే 29.07 బిలియన్‌ డాలర్ల నుంచి 28.8 బిలియన్‌ డాలర్లకు తగ్గిపోయింది. ఈ (2021-22) ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల (ఏప్రిల్‌, మే, జూన్‌) ఫలితాలను తాజాగా వెల్లడించారు.

ఫేస్‌బుక్‌ తొలిసారిగా 2007లో పబ్లిక్‌ ఇష్యూకి వెళ్లింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా సంస్థ రెవెన్యూ తగ్గకపోవటం గమనార్హం. ఇదిలాఉండగా ఈ ఏడాది 3వ త్రైమాసికంలో ఫేస్‌బుక్‌ ఆదాయం ఇంకా తగ్గనుందని అంటున్నారు. ఈ మేరకు అక్టోబర్‌, నవంబర్‌, డిసెంబర్‌ల వృద్ధి అంచనాలు వెలువడ్డాయి. మరోవైపు ఫేస్‌బుక్‌ మాతృ సంస్థ మెటా మొత్తం లాభం ఈ త్రైమాసికంలో 36 శాతం పడిపోయింది. తద్వారా 6.7 బిలియన్‌ డాలర్లకు పతనమైంది.

Andhra Pradesh Liquor Licence: ఏపీకి బార్‌ల అప్లికేషన్ల ద్వారా భారీ ఆదాయం!

జొమాటో ఉద్యోగులకు రూపాయికే షేరు

ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటో ఆసక్తికరమైన నిర్ణయం తీసుకుంది. తన ఉద్యోగులకు కోట్ల సంఖ్యలో షేర్లను కేటాయించింది. సంస్థ షేర్ల విలువ ఇటీవల భారీగా పడిపోవటంతో తాజాగా ఈ కేటాయింపులు చేసింది. 98 శాతం డిస్కౌంట్‌తో వాటాలను పంచటం విశేషం. ఎంప్లాయీ స్టాక్‌ ఆప్షన్‌ ప్లాన్‌(ఈఎస్‌ఓపీ) కింద 4 కోట్ల 65 లక్షల 51 వేల 600 ఈక్విటీలను స్టాఫ్‌కి ఇచ్చేసింది. ఒక్కో వాటా నామమాత్రంగా రూపాయికే కట్టబెట్టింది.

Exit mobile version