NTV Telugu Site icon

Business Flash 12-07-22: మరికొన్ని ముఖ్యమైన బిజినెస్ వార్తలు

Business Flash

Business Flash

దేశ ఆర్థిక వ్యవస్థ స్థితి’గతి’ని మార్చే ‘శక్తి’

ప్రైమ్‌ మినిస్టర్‌ (పీఎం) గతిశక్తి పోర్టల్‌ దేశ ఆర్థిక వ్యవస్థ స్థితిగతిని సమూలంగా మార్చనుంది. ఇండియా ఎకానమీని 2040 నాటికి 20 ట్రిలియన్‌ డాలర్లకు పెంచటమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ దిశలో ఈ నేషనల్‌ మాస్టర్‌ ప్లాన్‌ (ఎన్‌ఎంపీ) కీలక పాత్ర పోషించనుంది. అందుకే పీఎం గతిశక్తి పోర్టల్‌ అనే ఈ ఎన్‌ఎంపీని ఆర్థిక వ్యవస్థలో గేమ్‌ ఛేంజర్‌లా కేంద్రం అభివర్ణిస్తోంది. ఈ డిజిటల్‌ ప్లాట్‌ఫాంని మోడీ ప్రభుత్వం 2021 అక్టోబర్‌లో ప్రారంభించింది. దీని అమలుకయ్యే ఖర్చు 10 కోట్ల రూపాయలు. ఈ మెగా ప్లాన్‌లో 16 కేంద్ర మంత్రిత్వ శాఖలు పాల్గొననున్నాయి. అవి వివిధ ప్రాజెక్టులను ఒక ప్రణాళిక ప్రకారం అమలుచేస్తాయి.

మేలో 11 నెలల గరిష్టానికి పారిశ్రామిక ఉత్పత్తి!

వినియోగదారుడి ధరల పట్టిక (సీపీఐ) మే నెలలో పెరిగిందా లేదా అనేది ఈరోజు సాయంత్రం తేలిపోనుంది. ఆ నెలకు సంబంధించిన చిల్లర ధరల ద్రవ్యోల్బణం(రిటైల్‌ ప్రైస్‌ ఇన్‌ఫ్లేషన్‌-ఆర్‌పీఐ), పారిశ్రామిక ఉత్పత్తి ఫలితాలు మరికొద్దిసేపట్లో విడుదల కానున్నాయి. ఆర్‌పీఐ 6.8 శాతం నుంచి 7.25 శాతం వరకు చేరుకునే ఛాన్స్‌ ఉందని అంచనా వేస్తున్నారు. జూన్‌ నెలలో ఆర్‌పీఐ 7.04 శాతానికి పెరిగిన సంగతి తెలిసిందే. మరోవైపు.. పారిశ్రామిక ఉత్పత్తుల పురోగతి మే నెలలో 11 నెలల గరిష్టానికి పెరుగుతుందని ఆశిస్తున్నారు. అంటే ఇండస్ట్రియల్‌ ప్రొడక్షన్‌ గ్రోత్‌ 14.5 శాతం నుంచి 15.24 శాతానికి వృద్ధి చెందనుందని చెబుతున్నారు.

రూ.3600 కోట్లు సేకరించిన బైజుస్‌

ఎడ్యుకేషన్‌, టెక్నాలజీ (ఎడ్‌టెక్‌) ప్లాట్‌ఫామ్స్‌లో పేరొందిన బైజుస్‌ గత ఏడాది కాలంలో రూ.3600 కోట్లకు పైగా నిధులను సేకరించింది. దీంతో తమ ఫండ్‌ రైజింగ్‌ ప్రణాళికలు పట్టాలెక్కినట్లేనని ఆ సంస్థ హర్షం వ్యక్తం చేసింది. మొత్తం 13 మంది పెట్టుబడిదారుల నుంచి నిధులు ఆశించగా ఇప్పటికి 11 మంది ఇన్వెస్టర్లు డబ్బులిచ్చినట్లు వెల్లడించింది. ఈ ఫండింగ్‌ రౌండ్‌ గతేడాది జూన్‌లో ప్రారంభమైన సంగతి తెలిసిందే.