Site icon NTV Telugu

Freedom Plan: బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయికే నెలంతా అన్‌లిమిటెడ్ కాల్స్, డేటా, మెసేజెస్!

Untitled Design (5)

Untitled Design (5)

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ జనాలని ఆకట్టుకునేలా రూ.1 ఫ్రీడమ్ రీచార్జ్ ప్లాన్‌ను తిరిగి ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌తో కొత్తగా సిమ్ తీసుకునే కస్టమర్లు కేవలం ఒక రూపాయితో పూర్తి నెలపాటు రీచార్జ్ చేసుకోవచ్చు. అందులో భాగంగా అన్‌లిమిటెడ్ కాల్స్, 2GB డేటా, రోజుకు 100 SMSలు లభిస్తాయి.దీంతో బీఎస్‌ఎన్‌ఎల్ తిరిగి దూసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది.

ప్రస్తుతం ఎయిర్‌టెల్, జియో వంటి ప్రైవేట్ కంపెనీలు టెలికాం రంగాన్ని ముందుండి నడిపిస్తున్నాయి. టెక్నికల్ అప్‌గ్రేడ్ ఆలస్యం కావడం, దూర ప్రాంతాల్లో టవర్‌ల కొరత వంటి కారణాలతో బీఎస్‌ఎన్‌ఎల్ తన కస్టమర్లలో చాలామందిని కోల్పోయింది. అయితే ఇప్పుడు తిరిగి పోటీ ఇవ్వడానికి కంపెనీ వరుసగా ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటిస్తోంది.

ఇటీవలే బీఎస్‌ఎన్‌ఎల్‌ 5జీ సేవలు ప్రారంభం కావడంతో ప్రజల్లో మరింత ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా ప్రైవేట్ ఆపరేటర్లతో పోలిస్తే బీఎస్‌ఎన్‌ఎల్ రీచార్జ్ ప్లాన్‌లు తక్కువ రేట్లలో లభించడం కూడా వినియోగదారులను ఆకట్టుకుంటోంది.రూ.1 ఫ్రీడమ్ ప్లాన్ కీలక వివరాలు ఇలా ఉన్నాయి.ఈ ప్లాన్‌ను ఇప్పటికే స్వాతంత్ర్య దినోత్సవం, దీపావళి సందర్భాల్లో అందుబాటులోకి తీసుకువచ్చారు.వినియోగదారుల డిమాండ్ మేరకు ఇప్పుడు మళ్లీ ఈ ఆఫర్‌ను రీ–లాంచ్ చేశారు.

డిసెంబర్ 1 నుంచి 31 వరకు కొత్తగా పొందే సిమ్ కార్డ్‌కి మాత్రమే ఈ ప్లాన్ వర్తిస్తుందని బీఎస్ఎన్ఎల్ అధికారులు చెబుతున్నారు.కొత్త సిమ్‌ను పూర్తిగా ఉచితంగా ఇస్తారు. కేవలం రూ.1 చెల్లించి రీచార్జ్ చేస్తే అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్,2GB ఇంటర్నెట్ డేటా రోజుకు 100 SMSలు పంపవచ్చని బీఎస్ఎన్ఎల్ అధికారులు వెల్లడించారు. ఈ ఆఫర్‌కు భారీ స్పందన రావడంతో మళ్లీ ప్రవేశపెట్టామని బీఎస్‌ఎన్‌ఎల్ తమ అధికారిక X అకౌంట్ ద్వారా ప్రకటించింది.

Exit mobile version