Freedom Plan: బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయికే నెలంతా అన్‌లిమిటెడ్ కాల్స్, డేటా, మెసేజెస్!
- అందుబాటులోకి బీఎస్‌ఎన్‌ఎల్ రూ.1 ‘ఫ్రీడమ్ ప్లాన్’
- ఫ్రీడమ్ ప్లాన్ తో అన్‌లిమిటెడ్ కాల్స్,
- 2GB డేటా, రోజుకు 100 SMSలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ జనాలని ఆకట్టుకునేలా రూ.1 ఫ్రీడమ్ రీచార్జ్ ప్లాన్‌ను తిరిగి ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌తో కొత్తగా సిమ్ తీసుకునే కస్టమర్లు కేవలం ఒక రూపాయితో పూర్తి నెలపాటు రీచార్జ్ చేసుకోవచ్చు. అందులో భాగంగా అన్‌లిమిటెడ్ కాల్స్, 2GB డేటా, రోజుకు 100 SMSలు లభిస్తాయి.దీంతో బీఎస్‌ఎన్‌ఎల్ తిరిగి దూసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది.
ప్రస్తుతం ఎయిర్‌టెల్, జియో వంటి ప్రైవేట్ కంపెనీలు టెలికాం రంగాన్ని ముందుండి నడిపిస్తున్నాయి. టెక్నికల్ అప్‌గ్రేడ్ ఆలస్యం కావడం, దూర ప్రాంతాల్లో టవర్‌ల కొరత వంటి కారణాలతో బీఎస్‌ఎన్‌ఎల్ తన కస్టమర్లలో చాలామందిని కోల్పోయింది. అయితే ఇప్పుడు తిరిగి పోటీ ఇవ్వడానికి కంపెనీ వరుసగా ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటిస్తోంది.
Also Read
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్‌ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
- Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
- Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
ఇటీవలే బీఎస్‌ఎన్‌ఎల్ 5జీ సేవలు ప్రారంభం కావడంతో ప్రజల్లో మరింత ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా ప్రైవేట్ ఆపరేటర్లతో పోలిస్తే బీఎస్‌ఎన్‌ఎల్ రీచార్జ్ ప్లాన్‌లు తక్కువ రేట్లలో లభించడం కూడా వినియోగదారులను ఆకట్టుకుంటోంది.రూ.1 ఫ్రీడమ్ ప్లాన్ కీలక వివరాలు ఇలా ఉన్నాయి.ఈ ప్లాన్‌ను ఇప్పటికే స్వాతంత్ర్య దినోత్సవం, దీపావళి సందర్భాల్లో అందుబాటులోకి తీసుకువచ్చారు.వినియోగదారుల డిమాండ్ మేరకు ఇప్పుడు మళ్లీ ఈ ఆఫర్‌ను రీ–లాంచ్ చేశారు.
డిసెంబర్ 1 నుంచి 31 వరకు కొత్తగా పొందే సిమ్ కార్డ్‌కి మాత్రమే ఈ ప్లాన్ వర్తిస్తుందని బీఎస్ఎన్ఎల్ అధికారులు చెబుతున్నారు.కొత్త సిమ్‌ను పూర్తిగా ఉచితంగా ఇస్తారు. కేవలం రూ.1 చెల్లించి రీచార్జ్ చేస్తే అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్,2GB ఇంటర్నెట్ డేటా రోజుకు 100 SMSలు పంపవచ్చని బీఎస్ఎన్ఎల్ అధికారులు వెల్లడించారు. ఈ ఆఫర్‌కు భారీ స్పందన రావడంతో మళ్లీ ప్రవేశపెట్టామని బీఎస్‌ఎన్‌ఎల్ తమ అధికారిక X అకౌంట్ ద్వారా ప్రకటించింది.
Back by public demand – BSNL’s ₹1 Freedom Plan!
Get, a Free SIM with 2GB data/day, unlimited calls and 100 SMS/day for 30 days of validity.
Applicable for new users only! #BSNL #AffordablePlans #BSNLPlans #BSNLFreedomPlan pic.twitter.com/pgGuNeU8c2
— BSNL India (@BSNLCorporate) December 1, 2025
తాజావార్తలు
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!