NTV Telugu Site icon

Anand Mahindra: బాలుడి స్టంట్స్‌కు ఆనంద్‌ మహీంద్రా ఫిదా…

Anand Mahindra

Anand Mahindra

తన వ్యాపార వ్యవహారాల్లో ఎంత బిజీగా ఉన్నా ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా మాత్రం.. సోషల్‌ మీడియాను వదలరు.. ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో కొత్త విషయాలను పంచుకుంటూనే ఉంటారు.. ఆయన షేర్‌ చేసే పోస్టుల్లో కొన్ని సరదాలు.. మరికొన్ని సందేహాలు.. ఇంకొన్ని కొత్త ట్యాలెంట్‌ను వెలికి తీస్తూ.. ఇలా అనేక విషయాలను తన ఫాలోవర్లతో పంచుకుంటూరు.. ఆనంద్‌ మహీంద్రా షేర్‌ చేశాడంటే అది వైరల్‌ కావాల్సిందే.. అంతేకాదు.. సందర్భాన్ని బట్టి.. తనకు తోచిన సహాయం కూడా చేస్తూ ఉంటారు.. కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో భారతీయ క్రీడాకారులు సత్తా చాటిన విషయం తెలిసిందే.. భారత ఖ్యాతి చాటిన క్రీడాకారులను ప్రశంసించిన మహీంద్రా.. ఓ చిన్న పిల్లవాడి విన్యాసాలను తెలిపే వీడియోను తన సోషల్‌ మీడియా యాండిల్‌లో షేర్‌ చేశారు.. ఆ వీడియోలో.. రోడ్డుపై ఓ పదేళ్ల బాలుడు జిమ్నాస్టిక్ స్టంట్లు చేస్తున్నాడు.. అలవోకగా పల్టీలు కొడుతూ, జంప్‌ చేస్తూ ఔరా! అనిపిస్తున్నాడు.

Read Also: Yogi oppose Modi: మోడీ చెబుతున్నదేంటి..? యోగి చేస్తున్నదేంటి..?

అత్యంత ఆకర్షణీయమైన కంటెంట్‌ను తెరపైకి తీసుకురావడంలో ప్రసిద్ధి చెందిన మహీంద్రాకు ఈ వీడియో చిక్కింది.. తమిళనాడులోని తిరునెల్వేలిలో రోడ్డుపై ఓ బాలుడు నేర్పుగా విన్యాసాలు చేస్తున్నాడు.. చిన్న పిల్లవాడు ముందు మరియు వెనుక పల్టీలతో సహా పలు విన్యాసాలు చేస్తున్నారు.. చూపరులను కట్టిపారేసే విధంగా ఆ బాలుడి విన్యాసాలు ఉన్నాయి.. ఆ బాలుడి వీడియోను పంచుకున్నారు మహీంద్రా.. దేశంలో ప్రతిభను గుర్తించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. “కామన్వెల్త్ గేమ్స్ 2022లో బంగారు పతకాల వర్షం తర్వాత తదుపరి తరం ప్రతిభ రూపుదిద్దుకుంటోంది… దీనిని ఎవరూ గుర్తించడం లేదు. మనం ఈ ప్రతిభను వేగంగా ట్రాక్‌లోకి తీసుకురావాలి’ అనే క్యాప్షన్‌తో ఆ బాలుడి వీడియోను షేర్‌ చేశారు. తిరునెల్వేలి సమీపంలోని ఒక గ్రామంలో ఈ అబ్బాయిని చూసిన ఓ స్నేహితుడు ఈ వీడియోను తనకు పంపినట్లు తెలిపారు ఆనంద్‌ మహీంద్ర.. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

Anand Mahindra Latest Tweet