Anand Mahindra: బాలుడి స్టంట్స్‌కు ఆనంద్ మహీంద్రా ఫిదా…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తన వ్యాపార వ్యవహారాల్లో ఎంత బిజీగా ఉన్నా ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా మాత్రం.. సోషల్ మీడియాను వదలరు.. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో కొత్త విషయాలను పంచుకుంటూనే ఉంటారు.. ఆయన షేర్ చేసే పోస్టుల్లో కొన్ని సరదాలు.. మరికొన్ని సందేహాలు.. ఇంకొన్ని కొత్త ట్యాలెంట్‌ను వెలికి తీస్తూ.. ఇలా అనేక విషయాలను తన ఫాలోవర్లతో పంచుకుంటూరు.. ఆనంద్ మహీంద్రా షేర్ చేశాడంటే అది వైరల్ కావాల్సిందే.. అంతేకాదు.. సందర్భాన్ని బట్టి.. తనకు తోచిన సహాయం కూడా చేస్తూ ఉంటారు.. కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారతీయ క్రీడాకారులు సత్తా చాటిన విషయం తెలిసిందే.. భారత ఖ్యాతి చాటిన క్రీడాకారులను ప్రశంసించిన మహీంద్రా.. ఓ చిన్న పిల్లవాడి విన్యాసాలను తెలిపే వీడియోను తన సోషల్ మీడియా యాండిల్‌లో షేర్ చేశారు.. ఆ వీడియోలో.. రోడ్డుపై ఓ పదేళ్ల బాలుడు జిమ్నాస్టిక్ స్టంట్లు చేస్తున్నాడు.. అలవోకగా పల్టీలు కొడుతూ, జంప్ చేస్తూ ఔరా! అనిపిస్తున్నాడు.
Read Also: Yogi oppose Modi: మోడీ చెబుతున్నదేంటి..? యోగి చేస్తున్నదేంటి..?
Also Read
- Lalithaa Jewellery IPO: లలితా జ్యువెల్లరీ IPO వచ్చేసింది.. షేర్ ధర ఎంతంటే?
- Bank of America: అంబానీ కంపెనీపై అమెరికా బ్యాంక్ కన్ను.. రూ.18,268 కోట్ల భారీ డీల్!
- NPS Pension Scheme: వారికి కేంద్రం గుడ్‌న్యూస్.. రూ.99తోనే పెన్షన్ పథకం.. అర్హతలు, ప్రయోజనాలు ఇవే..
- India’s Richest Business Families: అదానీ నుంచి అంబానీ వరకు.. భారత బిజినెస్ ఫ్యామిలీల సంపద ఎంతో తెలుసా?
అత్యంత ఆకర్షణీయమైన కంటెంట్‌ను తెరపైకి తీసుకురావడంలో ప్రసిద్ధి చెందిన మహీంద్రాకు ఈ వీడియో చిక్కింది.. తమిళనాడులోని తిరునెల్వేలిలో రోడ్డుపై ఓ బాలుడు నేర్పుగా విన్యాసాలు చేస్తున్నాడు.. చిన్న పిల్లవాడు ముందు మరియు వెనుక పల్టీలతో సహా పలు విన్యాసాలు చేస్తున్నారు.. చూపరులను కట్టిపారేసే విధంగా ఆ బాలుడి విన్యాసాలు ఉన్నాయి.. ఆ బాలుడి వీడియోను పంచుకున్నారు మహీంద్రా.. దేశంలో ప్రతిభను గుర్తించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. “కామన్వెల్త్ గేమ్స్ 2022లో బంగారు పతకాల వర్షం తర్వాత తదుపరి తరం ప్రతిభ రూపుదిద్దుకుంటోంది… దీనిని ఎవరూ గుర్తించడం లేదు. మనం ఈ ప్రతిభను వేగంగా ట్రాక్‌లోకి తీసుకురావాలి’ అనే క్యాప్షన్‌తో ఆ బాలుడి వీడియోను షేర్ చేశారు. తిరునెల్వేలి సమీపంలోని ఒక గ్రామంలో ఈ అబ్బాయిని చూసిన ఓ స్నేహితుడు ఈ వీడియోను తనకు పంపినట్లు తెలిపారు ఆనంద్ మహీంద్ర.. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
Anand Mahindra Latest Tweet
And after the Gold rush for India at the #CWG2022 the next generation of talent is shaping up. Unsupported. We need to get this talent on the fast track. (This video shared by a friend who has seen this boy in a village near Tirunelveli) pic.twitter.com/DXBcGQjMX0
— anand mahindra (@anandmahindra) August 9, 2022
తాజావార్తలు
-
Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
-
Renukaswamy Murder: నటుడు దర్శన్‌కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
-
BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
-
Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
-
Rahul Gandhi: ఇటలీ ప్రధాని మెలోనీని టార్గెట్ చేసిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీ వీడియో వైరల్
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!