NTV Telugu Site icon

Bitcoin: క్రిప్టో కరెన్సీ మార్కెట్‌కు సరికొత్త ఊపు.. ట్రంప్ ఎన్నిక తర్వాత బిట్‌కాయిన్ ఆల్‌టైం రికార్డు

Bitcoin

Bitcoin

అగ్ర రాజ్యం అమెరికాకు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన తర్వాత క్రిప్టో కరెన్సీ మార్కెట్‌కు మంచిరోజులు వచ్చాయి. నవంబర్ 5 అధ్యక్ష ఎన్నికల ఫలితాల తర్వాత బుధవారం ప్రముఖ క్రిప్టో కరెన్సీ బిట్‌ కాయిన్‌ విలువ 90,000 డాలర్లకు చేరుకుంది. సరికొత్త ఆల్‌టైం రికార్డు గరిష్ఠాన్ని నమోదు చేసింది. భవిష్యత్‌లో బిట్‌ కాయిన్‌ సరికొత్త గరిష్ఠాలను తాకనుందని క్రిప్టో మార్కెట్‌ వర్గాలు పేర్కొన్నాయి.  అమెరికాను క్రిప్టో రాజధానిగా మారుస్తానని ట్రంప్ హామీ ఇచ్చారు.

ఇది కూడా చదవండి: Online Games Banned: ఆన్‌లైన్ గేమింగ్‌కు వ్యతిరేకంగా కేంద్ర మాజీ మంత్రి ప్రచారం, కఠినమైన చట్టం అవసరమంటూ..

అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగిన రోజు నుంచి ఇప్పటివరకు బిట్‌కాయిన్‌ విలువ 25 శాతానికి పైగా పుంజుకుంది. మరో క్రిప్టో కరెన్సీ ఈథర్‌ ఏకంగా 30 శాతం ఎగబాకింది. అమెరికాను క్రిప్టోల రాజధానిగా తీర్చిదిద్దుతానని, బిట్‌కాయిన్‌ల వ్యూహాత్మక నిల్వలను ఏర్పాటు చేస్తానని ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌ ప్రకటించారు. అంతేకాదు ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు అవసరమైన విరాళాలను క్రిప్టోల్లోనూ స్వీకరించారు. ట్రంప్‌ సానుకూల వైఖరితో ఈ వర్చువల్‌ కరెన్సీల విలువ మున్ముందు మరింత పెరగవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: H-1B visa: ట్రంప్ హయాంలో H-1B వీసా పరిమితి.. భారత్‌‌కి కొంచెం ఇష్టం, కొంచెం కష్టం..

Show comments