NTV Telugu Site icon

Michelle poonawalla: ముంబైలో రూ.500 కోట్లతో ఇల్లు కొనుగోలు చేసిన బిలియనీర్ దంపతులు

Michellepoonawalla

Michellepoonawalla

ప్రముఖ పారిశ్రామికవేత్త, బిలియనీర్ యోహాన్ పూనావాలా, భార్య మిచెల్‌ ముంబైలో ఖరీదైన భవంతిని కొనుగోలు చేశారు. దక్షిణ ముంబైలోని కఫ్ పరేడ్ ప్రాంతంలో రూ.500 కోట్లకు 30,000 చదరపు అడుగుల విస్తీరణంలో ఆస్తిని కొనుగోలు చేశారు. ఇటీవల కాలంలో అత్యంత ఖరీదైన నివాసం ఇదే కావడం విశేషం. దీనికి ‘పూనావాలా మాన్షన్’ అని నామకరణం చేశారు.

యోహాన్ పూనావాలా ఇంజినీరింగ్ గ్రూప్ ఛైర్మన్. పూనావాలా పేరుపై అనేక కంపెనీలు ఉన్నాయి. ఇతని తండ్రి జవరాయ్ పూనావాలా కూడా ప్రముఖ పారిశ్రామిక వేత్త. ప్రముఖ టీకా తయారీదారు అయిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాను సహ-స్థాపించారు. ఇక యోహాన్ పూనావాలా భార్య మిచెల్ కూడా ఇంజనీరింగ్ కంపెనీల మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఆమె డిజైన్ సంస్థ నిర్వహిస్తున్నారు.

తాజాగా కొనుగోలు చేసిన భవనంలో విశాలమైన లేఅవుట్ ఉంది. విశాలమైన డాబాలు, బహుళ అంతస్తులు కలిగి ఉంది. విలాసవంతమైన సెట్టింగ్, విస్తృతమైన కళాఖండాలు ఉన్నాయి. మిచెల్ పూనావాలా యొక్క ప్రత్యేకమైన ఆయిల్ పెయింటింగ్‌లు మరియు ఇతర విలువైన మొక్కలు ఉన్నాయి. నివాసంలో కొంత భాగాన్ని ప్రైవేట్ ఆర్ట్ గ్యాలరీగా మార్చారు.

దక్షిణ ముంబైలో ఇటీవల సెలబ్రిటీల ఆస్తుల కొనుగోళ్లు బాగా పెరిగాయి. క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, యువరాజ్ సింగ్ కూడా ఈ ప్రాంతాల్లోనే ఇళ్లులు కొనుగోలు చేశారు. విరాట్ కోహ్లీ ‘ఓంకార్ 1973’ ప్రాజెక్ట్‌లో రూ. 34 కోట్లకు విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశారు. రోహిత్ శర్మ వర్లీలోని అహుజా టవర్స్‌లో రూ. 30 కోట్ల ఆస్తిని సంపాదించారు. యువరాజ్ సింగ్ కూడా అదే పరిసరాల్లో రూ 64 కోట్ల ఆస్తిని కొనుగోలు చేశారు. అలాగే చలనచిత్ర నిర్మాత, దర్శకుడు దినేష్ విజన్ కూడా దక్షిణ ముంబైలోని ప్రముఖ ఆస్తి యజమానుల జాబితాలో చేరారు. 9,000 చదరపు అడుగుల రెసిడెన్షియల్ ప్రాపర్టీని కొనుగోలు చేశారు. సుహానా ఖాన్ అలీబాగ్‌లోని 1.5 ఎకరాల వ్యవసాయ భూమిని రూ. 12.91 కోట్లకు కొనుగోలు చేశారు. అలియా భట్ యొక్క ప్రొడక్షన్ హౌస్ బాంద్రాలోని 2,497 చదరపు అడుగుల అపార్ట్‌మెంట్‌ను రూ. 37.80 కోట్లకు కొనుగోలు చేయడం జరిగింది. ఇలా సెలబట్రీలంతా ఖరీదైన ఇల్లులను కొనుగోలు చేస్తున్నారు.