Site icon NTV Telugu

US Tariffs: ట్రంప్ సుంకంతో ఈ రెండు పరిశ్రమలపై ప్రభావం.. 50 లక్షల మంది కార్మికులు ఉద్యోగాలకు ముప్పు..!

Us Tarif1

Us Tarif1

US Tariffs: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై 25 శాతం సుంకం విధించారు. ఇది భారత ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. కాగా.. రాజస్థాన్‌లోని బికనీర్‌లో రెండు ప్రధాన పరిశ్రమలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ఇది కార్పెట్, ఉన్ని, నమ్కీన్ తోపాటు స్వీట్స్ పరిశ్రమలతో సంబంధం ఉన్న వ్యాపారుల ఆందోళనను పెంచింది. ప్రతి ఏటా బికనీర్ నుంచి దాదాపు రూ.2500 కోట్ల విలువైన కార్పెట్‌లు ఎగుమతి అవుతాయి. అందులో 70% అమెరికాకే వెళుతుంది. ఇక్కడి కార్పెట్ పరిశ్రమ స్థానిక స్థాయిలో ఉపాధిని కల్పించడమే కాకుండా.. దేశవ్యాప్తంగా దాదాపు 25 లక్షల మంది ప్రత్యక్ష, 50 లక్షల మంది పరోక్ష కార్మికులు దీనితో సంబంధం కలిగి ఉన్నారు. సుంకం విధించిన తర్వాత, కార్పెట్ తయారీ ఖర్చు పెరుగుతుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో పోటీ పడటం కష్టమవుతుంది. అందుకే పరిశ్రమలకు మద్దతు ప్యాకేజీలు ఇవ్వాలి అని రాజస్థాన్ ఉన్ని పరిశ్రమల సంఘం అధ్యక్షుడు కమల్ కల్లా అన్నారు.

READ MORE: US Tariffs: భారత ఆర్థిక వ్యవస్థపై “డెడ్ ఎకానమీ” వ్యాఖ్య.. ట్రంప్‌ను విమర్శిస్తున్న సొంత దేశస్థులు..!

దీంతో పాటు బికనేరి భుజియా, రస్గుల్లా(స్వీచ్‌)కు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది. కాబట్టి బికనేర్ నుంచి యూఎస్‌కి పెద్ద మొత్తంలో స్వీట్లు, నామ్కీన్ ఎగుమతి చేస్తారు. ఏటా దాదాపు 10 కోట్ల రూపాయల విలువైన నామ్కీన్(స్వీట్), స్వీట్లు యూఎస్‌కి ఎగుమతి చేస్తారు. కానీ సుంకం విధించడం వల్ల ఈ స్వీట్ల రంగం ప్రభావితమవుతుంది. వాణిజ్యంలో 30 నుంచి 40 శాతం తగ్గుదల ఉండే అవకాశం ఉంది. ఇది పండుగల సీజన్, పెద్ద సంఖ్యలో ఆసియన్లు అమెరికాలో నివసిస్తున్నారు. కాబట్టి ఈ స్వీట్ల పరిశ్రమ ప్రభావితం అవుతుంది. ఈ సుంకం అనంతరం వ్యాపారులు ఇప్పుడు ఇతర దేశాలలో ఎగుమతి అవకాశాలను పరీశీలించడం ప్రారంభించారు. కేంద్ర తమను కాపాడాలని కోరుతున్నారు.

Exit mobile version