Site icon NTV Telugu

Biggest Buyout in Asia: ఆసియాలోనే ఈ ఏడాది అతిపెద్ద కొనుగోలు

Biggest Buyout In Asia

Biggest Buyout In Asia

Biggest Buyout in Asia: ఈ ఏడాది ఆసియాలోనే అతిపెద్ద కొనుగోలు నమోదు కానుంది. జపాన్‌కి చెందిన తోషిబా సంస్థను అదే దేశంలోని జేఐపీ గ్రూప్ కన్సార్షియం.. టేకోవర్ చేసుకునే అంశాన్ని పరిశీలిస్తోంది. మల్టీ నేషనల్ కంపెనీ అయిన తోషిబా మార్కెట్ విలువను 16 బిలియన్ డాలర్లకు (2.4 ట్రిలియన్‌ యెన్‌లకు) పైగా నిర్దారించినట్లు తెలుస్తోంది. బైఔట్ వార్తల నేపథ్యంలో తోషిబా షేర్ విలువ నిన్న సోమవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి 5 వేల 391 యెన్స్ పలికింది. తోషిబాను కొనుగోలు చేయనున్న జేఐపీ గ్రూపు ఒక ట్రిలియన్‌ యెన్‌లను నగదు రూపంలో ఇవ్వనుంది.

మిగతా 1.4 ట్రిలియన్‌ యెన్‌లను బ్యాంకుల నుంచి ఫైనాన్స్‌ తీసుకోనుంది. టేకోవర్‌కి సంబంధించి రెండు సంస్థల మధ్య చర్చలు జరుగుతున్నాయి. అవి ఎలాంటి నిర్ణయానికి దారితీస్తాయో చూడాలి. మరో వైపు.. తోషిబా తన బిజినెస్‌ మొత్తాన్ని అమ్మాలనుకోవట్లేదు. కొన్ని అసెట్స్‌ను మాత్రమే సేల్‌ చేయాలనుకుంటోంది. దీనిపై ఇంకా ఒక నిర్ణయానికి రావాల్సి ఉంది. ఇదిలాఉండగా ఈ కొనుగోలుపై స్పందించేందుకు జేఐపీ మరియు సుమిటోమో మిత్సుయ్‌ బ్యాంకింగ్‌ కార్పొరేషన్‌ వర్గాలు నిరాకరించటం గమనార్హం.

Purna: దుబాయ్ లో ఘనంగా నటి పూర్ణ పెళ్లి.. వరుడు ఎవరో తెలిస్తే షాకే!

తోషిబా అధికార ప్రతినిధి స్పందిస్తూ ‘‘జనరల్‌ రూల్‌ ప్రకారం.. ఈ ప్రక్రియలో పాలుపంచుకుంటున్న పార్టీల (ఇన్వెస్టర్లు సహా) గురించి అప్పుడే ఓపెన్‌గా మాట్లాడుకోవటం సరికాదు’’ అని చెప్పారు. దేశీయంగా పార్టర్న్‌షిప్‌లను ఏర్పాటుచేసుకునేందుకు జేఐపీ.. ఓరిక్స్‌ కార్పొరేషన్ మరియు చుబు ఎలక్ట్రిక్‌ పవర్‌ కంపెనీ, గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థలైన బేరింగ్‌ ప్రైవేట్‌ ఈక్విటీ ఆసియా, సీవీసీ క్యాపిటల్‌ పార్ట్నర్స్‌తో సంప్రదింపులు జరుపుతోంది. బెయిన్‌ క్యాపిటల్‌ మరియు ఎంబీకే పార్ట్నర్స్‌.. జేఐసీ వైరల్‌ బిడ్‌ గ్రూపుతో చర్చిస్తున్నట్లు సమాచారం.

Exit mobile version