బంగారం ప్రియులకు మళ్లీ షాకిచ్చింది. వరుసగా రెండు రోజులు తగ్గిన బంగారం ధరలు.. శనివారం అమాంతంగా పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉద్రిక్త పరిస్థితులు.. ట్రంప్ విధించిన సుంకాలు కారణంగా మళ్లీ ధరలు కొండెక్కుతున్నాయి. తులం బంగారం ధర రూ. 1,530 పెరిగింది. సిల్వర్ ధర మాత్రం ఉపశమనం కలిగించింది.
ఇది కూడా చదవండి: Boda Kakarakaya: బోడకాకరకాయతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో..!
24 క్యారెట్ల గ్రాము బంగారం ధర 1,530 రూపాయలు పెరిగి.. ప్రస్తుతం తులం బంగారం ధర రూ.1,01,350 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 22 క్యారట్ల గ్రాము బంగారం ధర 1,400 రూపాయిలు పెరిగి.. తులం బంగారం ధర రూ. 92,900 దగ్గర ట్రేడ్ అవుతోంది. మరోవైపు 18 క్యారట్ల గ్రాము బంగారం ధర 1,140 రూపాయిలు పెరిగి 10 గ్రాముల ధర రూ.76,010 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇది ఇలా ఉండగా.. వెండి ధరలు ఉపశమనం కలిగిస్తోంది.. కేజీ వెండి రూ.1,13,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. ప్రాంతాల వారీగా నిత్యం బంగారం, వెండి ధరల్లో మార్పులు ఉంటాయి.
ఇది కూడా చదవండి: Trump: రష్యా-అమెరికా మధ్య ఉద్రిక్తతలు.. అణు జలాంతర్గాముల మోహరింపునకు ట్రంప్ ఆదేశం
