NTV Telugu Site icon

5G Auction: ‘5జీ’ వేలానికి సూపర్‌ రెస్పాన్స్‌.. తొలిరోజే ఇలా..

5g Auction

5g Auction

5జీ స్పెక్ట్రం కేటాయింపుల కోసం ఇవాళ వేలం ప్రారంభమైంది.. తొలిరోజు వేలానికి సూపర్‌ రెస్పాన్స్‌ వచ్చింది.. ఈ ప్రక్రియ రెండు రోజుల్లో పూర్తవుతుందని అధికార వర్గాలు తెలిపాయి. జియో, ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌-ఐడియాతోపాటు ఈసారి అదానీ నెట్‌వర్క్‌ కూడా ఈ ఆక్షన్‌లో ప్రధాన పోటీదారుగా పాల్గొంది.. 5జీ స్పెక్ట్రం వేలం ద్వారా ప్రభుత్వానికి లక్ష కోట్ల రూపాయలకు పైగా ఆదాయం వస్తుందని అంచనాలు ఉండగా.. ప్రస్తుతం మనం వాడుతున్న 4జీ నెట్‌వర్క్‌తో పోల్చితే 5జీ నెట్‌వర్క్‌లో పది రెట్లు వేగంగా ఆన్‌లైన్‌ సర్వీసులు అందనున్నాయి. ఇవాళ 72 గిగాహెర్జ్ 5జీ స్పెక్ట్రమ్ కేటాయింపుల కోసం వేలం ప్రారంభం అయ్యింది.. మొదటి రోజున బిడ్డింగ్ రూ.1.45 లక్షల కోట్లు దాటింది అంతే.. 5జీకి ఉన్న క్రేజ్‌ ఏంటో అర్థం చేసుకోవచ్చు..

Read Also: Gas Cylinder Blast: గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు మృతి.. తెరవెనుక కుట్ర?

భారత్ లో టెలికాం స్పెక్ట్రమ్ కోసం ఇంత భారీ వేలం నిర్వహించడం ఇదే తొలిసారి కావడం విశేషం.. వేలంలో.. జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా, అదానీ గ్రూప్ కు చెందిన యాక్టివ్ లీ వంటి సంస్థలు పాల్గొనడంతో అనూహ్యంగా స్పందన వచ్చిందని అంచనా వేస్తున్నారు.. తొలిరోజు వేలంలో నాలుగు రౌండ్లు నిర్వహించామని, బిడ్డింగ్ మొత్తం రూ.1.45 లక్షల కోట్లు దాటిందని కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఇక, బుధవారం ఐదో రౌండ్ వేలం చేపట్టనున్నారు.. అయితే, ఇది అల్ట్రా-హై స్పీడ్‌లను (4G కంటే దాదాపు 10 రెట్లు ఎక్కువ) అందిస్తుంది. ఉచిత కనెక్టివిటీ, డేటాను పంచుకోవడానికి బిలియన్ల కొద్దీ కనెక్ట్ చేయబడిన పరికరాలను ప్రారంభించవచ్చు. ఐదో రౌండ్ వేలం రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఆగస్ట్ 15 నాటికి స్పెక్ట్రమ్ కేటాయింపును పూర్తి చేయాలని భావిస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు.. 2022 చివరి నాటికి చాలా నగరాల్లో 5జీ సేవలు అందుతాయని వైష్ణవ్ చెప్పారు. 3300 MHz మరియు 26 GHz బ్యాండ్‌లు బలమైన బిడ్‌లను ఆకర్షించాయి – మిడ్ మరియు హై-ఎండ్ బ్యాండ్‌లు ఆసక్తిని కనబరిచాయి. 700 మెగాహెర్ట్జ్ బ్యాండ్‌కు బిడ్లు కూడా వచ్చాయని మంత్రి విలేకరులకు తెలిపారు. నలుగురు బిడ్డర్లు పాల్గొనడం కలిసే వచ్చే అంశంగా అభివర్ణించారు.

Show comments