Site icon NTV Telugu

ఫిర్యాదులలో ఎయిర్‌టెల్‌ రికార్డు..! ఏంటిది..?

ఎయిర్‌టెల్‌ ఓ చెత్త రికార్డు సృష్టించింది.. అదేంటి? అనే అనుమానం వెంటనే రావొచ్చు.. విషయం ఏంటంటే.. తమకు సర్వీసులో తలెత్తుతున్న ఇబ్బందులు, లోపాలపై టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ట్రాయ్‌)కి ఫిర్యాదులు చేశారు వినియోగదారులు.. అన్ని టెలికం సంస్థలపై యూజర్ల నుంచి ఫిర్యాదులు అందినా.. ఎయిర్‌టెల్‌పై అత్యధిక ఫిర్యాదులు అందాయి.. ఈ విషయాన్ని మంత్రి దేవుసింహ్‌ చౌహాన్‌ లోక్‌సభలో వెల్లడించారు.. ఈ ఏడాదిలో నెట్‌వర్క్‌ సర్వీస్‌ ప్రొవైడర్లపై దేశవ్యాప్తంగా ట్రాయ్‌కి వేల సంఖ్యలో ఫిర్యాదులు అందాయని.. అందులో అత్యధికంగా ఎయిర్‌టెల్‌పై 16,111 ఫిర్యాదులు వచ్చాయని.. ఆ తర్వాత వోడాఫోన్‌ ఐడియాపై 14,487, రిలయన్స్‌ జియోపై 7,341 ఫిర్యాదులు ట్రాయ్‌కి వచ్చినట్టు తెలిపారు. ప్రభుత్వ రంగం టెలికం సంస్థలపై కూడా ట్రాయ్‌కు ఫిర్యాదులు అందాయి.. కానీ, ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ సర్వీస్‌ ప్రొవైడర్లకంటే ఇది చాలా తక్కువే… ఎందుకుంటే.. బీఎస్‌ఎన్‌ఎల్‌పై 2,913 ఫిర్యాదులు అందితే.. ఎంఎన్‌టీఎల్‌పై 732 మంది మాత్రమే ఫిర్యాదు చేశారు… మొత్తంగా అత్యధిక ఫిర్యాదులు రావడంతో ఓ చెత్త రికార్డు నెత్తిన ఎత్తుకుంది ఎయిర్‌టెల్.

Exit mobile version