NTV Telugu Site icon

Airtel: ఎల‌న్ మ‌స్క్‌కు పోటీగా ఎయిర్ టెల్ ప్ర‌యోగం…

ప్ర‌పంచంలో ఏ మూల‌కు వెళ్లినా హైస్పీడ్ ఇంట‌ర్నెట్ వ‌చ్చేలా చూసేందుకు ఎల‌న్ మ‌స్క్ స్టార్ లింక్స్ ఉప‌గ్ర‌హాల‌ను ప్ర‌యోగిస్తున్నారు. స్పేస్ ఎక్స్ సంస్థ ఈ ఉప‌గ్ర‌హాల‌ను ప్ర‌యోగిస్తున్న సంగ‌తి తెలిసిందే. కాగా, ఎల‌న్ మ‌స్క్‌కు పోటీగా ఎయిర్‌టెల్ వ‌న్‌వెబ్ పేరుతో ఫ్రెంచ్ గ‌యానాలోని కౌర్ స్పేస్ సెంట‌ర్ నుంచి భార‌తీ ఎయిర్‌టెల్ 34 ఉప‌గ్రహాల‌ను ప్ర‌యోగించింది. ఇంట‌ర్నెట్ కోసం ఈ ఉప‌గ్ర‌హాల‌ను ప్ర‌యోగించింది. ఈ ఏడాది ఎయిర్ టెల్ ప్ర‌యోగించిన మొద‌టి ప్ర‌యోగం ఇది. 34 ఉప‌గ్ర‌హాలను విజ‌య‌వంతంగా అంత‌రిక్షంలోకి ప్ర‌వేశ‌పెట్టారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎయిర్‌టెల్ మొత్తం 13 సార్లు ఈ ప్ర‌యోగాలు చేసింది. మొత్తం 428 ఉప‌గ్ర‌హాల‌ను ప్ర‌వేశ‌పెట్టారు. బ్రాడ్‌బ్యాండ్ వేగం పెంచేందుకు ఈ ఉప‌గ్ర‌హాలు స‌హ‌య‌ప‌డ‌నున్నాయి. భ‌విష్య‌త్తులో మ‌రిన్ని ప్ర‌యోగాలు చేప‌డ‌తామ‌ని వ‌న్‌వెబ్ తెలియ‌జేసింది.

Read: Pilot less Helicopter: అద్భుత సృష్టి… పైల‌ట్ అవ‌స‌రం లేకుండానే…