బ్రెజిల్‌తో ఒప్పందం రద్దు.. కారణం అదే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్ బయోటెక్… బ్రెజిల్ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం… ఆ దేశంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఒప్పందంలో బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సనారో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. కోవాగ్జిన్ సరఫరాలో అవినీతి జరిగిందనే కోణంలో పార్లమెంటరీ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ దృష్టి సారించింది. బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బొల్సొనారో ప్రత్యేక ఆసక్తి కనబర్చారని, సన్నిహితులకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారని ఆరోపణలు వచ్చాయి. అమెరికాకు చెందిన ఫైజర్, చైనాకు చెందిన సినోవాక్‌ను కాదని… బ్రెజిల్ ఆరోగ్య నియంత్రణ సంస్థల అనుమతి లేని… కోవాగ్జిన్‌తో ఎందుకు ఒప్పందం చేసుకున్నారని చెప్పాలంటున్నారు సెనేటర్లు. అధ్యక్షుడు బోల్సనారో ఏ ప్రయోజనాలు ఆశించారో చెప్పాలని నిలదీస్తున్నారు.
కాగా, బ్రెజిల్ ప్రభుత్వం… వ్యాక్సినేషన్ కోసం భారత్ బయోటెక్ సంస్థతో ఫిబ్రవరిలో 324 మిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది. రెండు కోట్ల టీకాలకు ఆర్డర్ ఇస్తే.. అవి సకాలంలో డెలివరీ కాకపోవడంతో బొల్సనారో మరింత ఇరకాటంలో పడ్డారు. వాక్సిన్ ఒప్పందంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని బ్రెజిల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. వరుస ఆరోపణలు రావడంతో.. దర్యాప్తులో భాగంగా.. మరింత లోతైన విశ్లేషణ కోసమే డీల్‌ను నిలిపివేసినట్లు తెలిపింది. మరోవైపు తానెలాంటి అవినీతికి పాల్పడలేదని బోల్సనారో ప్రకటించారు. బ్రెజిల్‌తో వ్యాక్సిన్ల కాంట్రాక్ట్‌పై భారత్ బయోటెక్ సంస్థ స్పందించింది. బ్రెజిల్ నుంచి కోవాగ్జిన్ సరఫరా కోసం… ఎలాంటి అడ్వాన్స్ తీసుకోలేదని స్పష్టం చేసింది. ఆ దేశానికి కోవిడ్ టీకాలను కూడా సరఫరా చేయలేదని భారత్ బయోటెక్ వెల్లడించింది. 8 నెలల పాటు సాగిన ఒప్పందంలో అన్ని షరతులను పాటించినట్లు తెలిపింది. జూన్ 29 వరకు తమకు ఎటువంటి పేమెంట్ అందలేదని సంస్థ ప్రకటించింది. విదేశాలకు సరఫరా చేసే టీకా ధరను… డోసుకు 15 నుంచి 20 డాలర్లుగా నిర్ధారించినట్లు ఆ సంస్థ వెల్లడించింది. బ్రెజిల్‌కు డోసుకు 15 డాలర్ల చొప్పున అమ్మేందుకు ఒప్పందం కుదుర్చుకున్నామని స్పష్టం చేసింది.
Also Read
- 24 Carat Gold: బంగారం 24 క్యారెట్లే ఎందుకు? 50 లేదా 100 క్యారెట్లు ఎందుకు ఉండవు? 3,000 ఏళ్ల చరిత్ర.. మీకు తెలుసా?
- Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
- LPG Tax: షాక్ తప్పదా..! ఎల్పీజీ సిలిండర్‌పై కొత్త పన్ను..? అసలు ప్రతిపాదన ఏమిటి..?
- Plastic Currency Notes: ఆర్బీఐ కీలక నిర్ణయం.. మార్కెట్లోకి ప్లాస్టిక్ రూ.10, రూ.20 నోట్లు..! మరి పాత నోట్ల పరిస్థితి ఏంటి..?
తాజావార్తలు
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
-
Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!