Site icon NTV Telugu

New Rules: కేంద్ర బడ్జెట్ వేళ.. రేపటి నుంచి మారనున్న రూల్స్ ఇవే!

Feb

Feb

దేశ ప్రజల చూపంతా ఇప్పుడు కేంద్రం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ పైనే ఉంది. ఏయే రంగాలకు ఎంత కేటాయిస్తారు? వస్తువుల ధరలు పెరుగుతాయా? తగ్గుతాయా? బంగారం ధరల పరిస్థితి ఏంటి అంటూ చర్చలు మొదలయ్యాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర బడ్జెట్ వేళ రేపటి నుంచి కొన్ని రూల్స్ మారనున్నాయి. ప్రతి నెల మాదిరిగానే ఫిబ్రవరి నెలలో కూడా బ్యాంకింగ్, యూపీఐ, గ్యాస్ వంటి వాటిల్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఆర్థికపరమైన అంశాల్లో కొత్త నిబంధనలు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

బ్యాంకింగ్ రూల్స్:

ప్రతి నెల 1న బ్యాంకులు కొత్త రూల్స్ ను తీసుకొస్తుంటాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్ ఫిబ్రవరి 1 నుంచి కొన్ని మార్పులను తీసుకొస్తోంది. వాటిల్లో ఏటీఎం ట్రాన్సాక్షన్స్ ఉచిత పరిమితిని తగ్గించడం, ఇతర ఛార్జీలను పెంచనున్నట్లు బ్యాంక్ వర్గాలు వెల్లడించాయి.

LPG సిలిండర్ ధరలలో మార్పు:

చమురు సంస్థలు ప్రతి నెల 1వ తేదీన ధరలను సవరిస్తుంటాయి. ఈ మార్పు కోట్లాది మంది ప్రజల ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపిస్తాయి. అయితే ఎల్పీజీ గ్యాస్ ధరలు పెరగొచ్చు లేదా తగ్గొచ్చు. లేదా స్థిరంగా కూడా ఉండొచ్చు.

UPI కొత్త రూల్స్:

ఫిబ్రవరి 1 నుంచి యూపీఐ పేమెంట్స్ లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. స్పెషల్ క్యారెక్టర్లు కలిగిన యూపీఐ ఐడీలను ఆమోదించరు. @,#,$,%,,&.. ఇలాంటి ప్రత్యేక అక్షరాలు కలిగిన ట్రాన్సాక్షన్స్ ను రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఆల్ఫా-న్యూమరిక్ (అక్షరాలు, సంఖ్యలు) లావాదేవీ IDలు మాత్రమే చెల్లుబాటు అవుతాయి.

మారుతీ సుజుకీ కార్ల ధరలు పెంపు:

ఫిబ్రవరి 1 నుంచి వాహన ప్రియులకు మారుతీ సుజుకి షాకివ్వబోతోంది. రేపటి నుంచి పలు మోడళ్ల ధరలను భారీగా పెంచుతున్నట్లు ప్రకటించింది. విడిభాగాలు, నిర్వహణా వ్యయం కారణంగా మారుతీ సుజుకీ కార్ల ధరలను భారీగా పెంచుతున్నట్లు వెల్లడించింది. Alto K10, S-Presso, Celerio, Wagon R, Swift, DZire, Brezza, Ertiga, Ignis, Baleno, Ciaz, XL6, FrontX, Invicto, Jimny, Grand Vitara మోడళ్ల ధరలు మారనున్నాయి.

Exit mobile version