NTV Telugu Site icon

SBI: గుడ్‌న్యూస్‌ చెప్పిన ఎస్బీఐ.. వారికి మాత్రమే..!

Sbi

Sbi

ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది.. ఇప్పటి వరకు వరుసగా వడ్డీ రేట్లు పెంచుతూ.. నెలవారి చెల్లించే.. గృహ, వాహన, ఇతర రుణాలపై భారం మోపుతూ వచ్చిన ఎస్బీఐ.. ఇప్పుడు సేవింగ్స్‌ బ్యాంక్‌ డిపాజిట్లపై వడ్డీ రేటును పెంచింది.. అయితే, అందులో కూడా ఓ మెలిక ఉంది.. వేలు, లక్షల్లో కాకుండా కోట్లలో పొదుపు చేసేవారికే లబ్ధిచేకూరనుంది.. రూ.10 కోట్ల లేదా అంతకన్నా ఎక్కువగా ఉన్న సేవింగ్‌ డిపాజిట్లపై 0.30 శాతం(30 బీపీఎస్) ఇంట్రెస్ట్‌ రేటును పెంచుతూ నిర్ణయాన్ని ప్రకటించింది ఎస్బీఐ.. ఇక, రూ.10 కోట్ల కన్నా తక్కువగా ఉన్న డిపాజిట్లపై మాత్రం వడ్డీ రేటులో ఎలాంటి మార్పులేదని స్పష్టం చేసింది.. కాగా, రూ.10 కోట్ల కన్నా తక్కువ డిపాజిట్లపై ప్రస్తుతం 2.70 శాతం ఇంట్రెస్ట్‌ రేట్‌ ఉండగా.. ఇప్పుడు అది 0.30 బీపీఎస్‌ పెరగనుంది.. పెంచిన వడ్డీరేట్లు అక్టోబర్‌ 15వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు ఎస్బీఐ పేర్కొంది.

Read Also: Gujarat: షాకింగ్ ఘటన.. డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో వ్యక్తి మృతి

కాగా, రెండు రోజుల క్రితం, ఎస్బీఐ హోమ్ లోన్ విభాగంలో అగ్రస్థానంలో కొనసాగుతోందని మరియు నిర్వహణలో 6 ట్రిలియన్ల ఆస్తులు ఉన్నాయని… ఈ మైలురాయిని చేరుకున్న సమయంలో పండుగ బొనాంజాను ప్రకటించింది ఎస్బీఐ.. అందులో భాగంగా ఎస్బీఐ గృహ రుణాలపై 0.25 శాతం, టాప్ అప్ లోన్‌లపై 0.15 శాతం మరియు ఆస్తిపై రుణంపై 0.30 శాతం వరకు రాయితీని అందిస్తుంది. 31 జనవరి 2023 వరకు గృహ రుణాలపై ప్రాసెసింగ్ రుసుములను మాఫీ చేయడం ద్వారా మరో తీపికబురు చెప్పింది.. జూన్ 30, 2022 నాటికి, బ్యాంక్ డిపాజిట్ బేస్ రూ. 40.46 లక్షల కోట్లు సీఏఎస్‌ఏ నిష్పత్తి 45.33 శాతం మరియు అడ్వాన్స్‌లు రూ. 29 లక్షల కోట్లు. గృహ రుణాలు మరియు వాహన రుణాలలో ఎస్బీఐ వరుసగా 33.3 శాతం మరియు 19.3 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. ఎస్బీఐ భారతదేశంలో 67,735 బీసీ అవుట్‌లెట్‌లతో 22,294 శాఖలు మరియు 65,561 ఏటీఎంలు.. ఇలా అతిపెద్ద నెట్‌వర్క్‌ను కలిగి ఉన్న విషయం తెలిసిందే.