NTV Telugu Site icon

Arvind Krishna: రోజుకు రూ. 45 లక్షల జీతం తీసుకుంటున్న తెలుగు తేజం!

Arvind Krishna

Arvind Krishna

ఐబీఎం సీఈవో అరవింద్ కృష్ణ. ప్రపంచంలో అత్యధిక వేతనం పొందుతున్న కొద్దిమంది ఎగ్జిక్యూటివ్‌లలో ఆయన కూడా ఉన్నారు. ఆయన వార్షిక ప్యాకేజీ దాదాపు రూ.165 కోట్లు. ఈ విధంగా రోజుకు దాదాపు రూ.45 లక్షలు సంపాదిస్తున్నారు. 2023లో ఆయన జీతం రూ.30 కోట్లు భారీగా పెరిగింది. కృష్ణ 1990 నుంచి ఐబీఎమ్‌ తో అనుబంధం కలిగి ఉన్నారు. ఆయన కంపెనీలో 34 ఏళ్లుగా పనిచేస్తున్నారు. 2020లో సీఈవో అయినప్పటి నుంచి.. ఆయన కంపెనీని ముందుకు తీసుకెళ్లడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. అరవింద్ కృష్ణ కథ సినిమా కథ కంటే తక్కువేం కాదు. 1990లోఐబీఎంలో చేరిన తర్వాత కంపెనీలో వివిధ హోదాల్లో పనిచేశారు. సీఈవో కాకముందు కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఆయన నాయకత్వంలో.. ఐబీఎమ్ రెడ్ హట్(IBM Red Hat)ని $34 బిలియన్లకు కొనుగోలు చేసింది. ఇది ఒక ముఖ్యమైన విజయం. ఇదొక్కటే కాదు.. కృష్ణ పేరు మీద 15 పేటెంట్లు కూడా ఉన్నాయి. ఇది ఆయన సాంకేతిక చతురతకు నిదర్శనం.

READ MORE: Nara Lokesh: ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్స్‌లో వెనుకబడిన ఏపీ వర్సిటీలు.. మంత్రి లోకేష్ అసంతృప్తి

ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ..

అరవింద్ కృష్ణ ఆంధ్ర ప్రదేశ్ నివాసి. ఆయన తండ్రి ఇండియన్ ఆర్మీలో అధికారి. తల్లి సైనిక వితంతువుల సంక్షేమం కోసం కృషి చేశారు. తెలుగు మాట్లాడే కుటుంబంలో పెరిగిన కృష్ణ తన పాఠశాల విద్యను తమిళనాడు, డెహ్రాడూన్‌లలో పూర్తి చేశారు. ఆ తర్వాత ప్రతిష్టాత్మకమైన ఐఐటీ కాన్పూర్‌లో అడ్మిషన్ తీసుకున్నారు. ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన తర్వాత ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ చేసేందుకు అమెరికా వెళ్లారు. ఇక్కడే ఆయనకి ఐబిఎమ్‌లో ఉద్యోగం వచ్చింది. అది ఆయన జీవితాన్ని మార్చింది. కృష్ణ నాయకత్వంలో ఐబిఎమ్‌ ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలలో ఒకటిగా మారింది. కంపెనీ మార్కెట్ విలువ రూ. 1,450,000 కోట్ల కంటే ఎక్కువ. కంపెనీని ముందుకు తీసుకెళ్లడంలో కృష్ణ ఎంత ముఖ్యమైన పాత్ర పోషించాడో జీతం పెరుగుదల తెలియజేస్తుంది. ఐబిఎమ్‌ ప్రపంచంలోని పురాతన, అతిపెద్ద ఐటీ కంపెనీలలో ఒకటి.