Site icon NTV Telugu

Anthropic CEO: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల ఉద్యోగాలు ఊస్ట్.. ఆంథ్రోపిక్ సీఈవో హెచ్చరిక..

Ai

Ai

Anthropic CEO: టెక్ రంగంలో సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఆంథ్రోపిక్ సంచలనం సృష్టిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా టెక్ షేర్ల పడిపోయేలా చేసింది. దేశీయ సాఫ్ట్‌వేర్ దిగ్గజాలు ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు కుదేలయ్యాయి. భారీ సంపద ఆవిరై పోయింది. ఆంథ్రోపిక్ కంపెనీ తీసుకువచ్చిన క్లాడ్ కోవర్క్ అనే ఏఐ టూర్ టెక్ రంగంలో దుమారాన్ని రేపింది. ఈ ఏఐ మన సిస్టమ్ లోని ఫైళ్లు, పోల్డర్లను యాక్సెస్ చేసి, మనం ఇచ్చే పనుల్ని చక్కపెట్టేస్తోంది. జీతాల లెక్కలు, డేటా అనాలిసిస్, స్టాక్ మార్కెట్ రిపోర్టు , న్యాయపరమైన అంశాలతో కూడిన నివేదిక కావచ్చు, ఏ పనినైనా క్లాడ్ కోవర్క్ ఈజీగా చేయగలదని కంపెనీ చెబుతోంది.

Read Also: టీ20 వరల్డ్‌కప్‌కు ముందు Rinku Singhకు షాక్.. సోషల్ మీడియా అకౌంట్ హ్యాక్!

ఇదిలా ఉంటే, ఇప్పటికే అనేక ఏఐ టూల్స్‌తో సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఎప్పుడు ఎవరి ఉద్యోగం పోతుందో అనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పుడు ఆంథ్రోపిక్ రాకతో ఈ భయాలు మరింత పెరిగాయి. తాజాగా, ఆంథ్రోపిక్ సీఈవో దారియో అమోడీ చేసిన వ్యాఖ్యలు సాఫ్ట్ వేర్ ఉద్యోగుల వెన్నులో వణుకుపుట్టిస్తోంది. వచ్చే 5 ఏళ్లలో 50 శాతం ఎంట్ర లెవల్ వైట్ కాలర్ ఉద్యోగాలు పోతాయని చెప్పారు. ఇదే కాకుండా వచ్చే 6 నుంచి 12 నెలల్లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లను పూర్తిగా రీప్లేస్ చేసే ఏఐ మోడల్స్ రావచ్చని హెచ్చరించారు. . ఆయన హెచ్చరికల తర్వాత వచ్చిన యూఎస్ బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ కూడా ఇదే తరహా డేటాను చూపిస్తోంది. డిసెంబర్‌ 2025లో ఉద్యోగావకాశాలు 6.54 మిలియన్లకు పడిపోయాయని చెప్పింది. సెప్టెంబర్ 2020 తర్వాత ఇదే అత్యల్పం అని నివేదిక చెబుతోంది.

టెక్ రంగంలో ఏఐ పురోగతి అనుకున్న దానికన్నా చాలా వేగంగా పెరుగుతోందని దామోడీ వెల్లడించారు. ఇది మనుషులు చేసే పనికి సామాన్య ప్రత్యామ్నాయం అవుతోందని అన్నారు. లా, ఫైనాన్స్, కన్సల్టింగ్ రంగాల్లో దీని ప్రభావం ఉంటుందని చెప్పారు. ఇప్పటికే చాలా టెక్ కంపెనీలు తమ ఉద్యోగుల్ని తీసిపారేస్తున్నాయి. అమెజాన్ ఇటీవల భారీ లేఆఫ్స్ ప్రకటించింది. రానున్న రోజుల్లో టెక్ కంపెనీల్లో భారీగా ఉద్యోగుల తీసివేత కార్యక్రమాలు ఉండే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే టెక్కీల్లో భయాలు పెరుగుతున్నాయి.

Exit mobile version