రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆర్థిక కష్టాలు తొలగి లాభాల్లోకి వస్తుండగా మళ్లీ పెద్ద చిక్కుల్లో పడ్డారు. నకిలీ బ్యాంక్ గ్యారెంటీని సమర్పించినందుకు రిలయన్స్ పవర్ కంపెనీ, దాని అనుబంధ సంస్థపై క్రిమినల్ ప్రొసీడింగ్‌లను ఎందుకు ప్రారంభించకూడదని కోరుతూ భారతదేశ క్లీన్ ఎనర్జీ ఏజెన్సీ ఎస్‌ఈసీఐ షోకాజ్ నోటీసు పంపింది.
ఇది కూడా చదవండి: JC Prabhakar Reddy: జేసీ వార్నింగ్.. అలా చేస్తే.. కుళాయి, విద్యుత్ కనెక్షన్ కట్..!
గత వారం సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్.. రిలయన్స్ పవర్, దాని యూనిట్లలో ఒక యూనిట్ విదేశీ బ్యాంక్ గ్యారెంటీకి నకిలీ ఎండార్స్‌మెంట్‌ను సమర్పించిందనే ఆరోపణలపై మూడేళ్లపాటు వేలంలో పాల్గొనకుండా నిషేధించింది. తాజాగా రిలయన్స్ పవర్‌కు అనుబంధ సంస్థ అయిన రిలయన్స్ ఎన్‌యు బీఈఎస్ఎస్ సమర్పించిన బ్యాంక్ గ్యారెంటీ కూడా నకిలీదని ఎస్‌ఈసీఐ తన నోటీసులో పేర్కొంది. ఎస్‌ఈసీఐ చర్య తర్వాత గురువారం బీఎస్‌ఈలో రిలయన్స్ పవర్ షేర్లు 1.53 శాతం పడిపోయి రూ.36 దగ్గర స్థిరపడ్డాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో రూ. 2,878.15 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని నమోదు చేసి రుణ రహితంగా మారిన కొద్ది రోజులకే అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ పవర్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది.
ఇది కూడా చదవండి: Anmol: ఈ దున్న ఖరీదు ఏకంగా రూ. 23 కోట్లు.. రోజూ డ్రైఫ్రూట్స్, ఎగ్స్ ఆహారం..