Site icon NTV Telugu

Anand Mahindra: ఫన్నీ వీడియోతో బిజినెస్‌ పాఠాలు.. అసలైన టీమ్‌ వర్క్‌ ఇదే..

ఆనంద్‌ మహీంద్ర దేశంలో పేరుమోసిన వ్యాపారవేత్త మాత్రమే కాదు.. సోషల్‌ మీడియాలో ఎంతోమందికి చేరువైన వ్యక్తి.. కొన్ని సార్లు ఆయన జోకులు వేస్తారు.. నవ్విస్తారు.. కొన్ని వీడియోలతో కట్టిపడేస్తారు.. ఆలోచింపజేస్తారు.. భవిష్యత్‌ వైపు బాటలు వేసుకునేవిధంగా సూచనలు చేస్తారు.. ఎంతో మందికి తన వంతుగా సాయం చేస్తుంటారు.. వ్యాపార విషయాలతో ఆయన ఎంత బిజీగా ఉన్నా.. వేల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతిగా ఉన్నా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ దేశం నలుమూలలా దాగిన ప్రతిభను ప్రోత్సహిస్తూ ఉంటారు.. మంచి బిజినెస్‌ పాఠాలను కూడా చెబుతుంటారు. తాజాగా, ఓ ఫన్నీ వీడియోను షేర్‌ చేసిన మహీంద్ర… వీకెండ్‌ ముగిసింది.. వారం ప్రారంభమైంది.. ఈ సమయంలో.. ఆనంద మహీంద్ర చేసిన ట్వీట్.. కొంత ప్రేరణ కల్పించేవిధంగా ఉంది.. టీమ్‌ వర్క్‌కు ఉన్న ప్రాధాన్యతను వివరించేలా ఉన్న ఆ ఫన్నీ వీడియోతో అందరినీ ఆలోచింపజేశారు.

Read Also: YS Jagan: నేను లేకుంటే గౌతమ్ రాజకీయాల్లోకి వచ్చే వాడు కాదేమో..

ఇక, అసలు విషయానికి వస్తే.. పార్కింగ్‌ స్లాట్‌లో పడిఉన్న ఓ చిన్న తినుబండరం కోసం ఒక పిల్లి, రెండు కాకులు పోటీ పడుతుంటాయి.. అప్పటికే తినుబండం పిల్లి నోటికి అందేంత దగ్గర ఉంటుంది.. అయితే, రెండు కాకులు ఒక టీమ్‌గా పని చేస్తూ.. ఆ తినుబండరాన్ని తమ కంటే బలవంతమైన పిల్లికి దొరకకుండా తీసుకొని వెళ్తాయి.. ఒక పిల్లి, రెండు కాకులకు సంబంధించిన వీడియోను షేర్‌ చేసిన ఆనంద్‌ మహీంద్రా… మీరు కనుక టీమ్‌ వర్క్‌ చేస్తే అద్భుతమైన ఫలితాలు సాధిస్తారంటూ తేల్చేస్తూ.. బిజినెస్‌ పాఠాలు బోధించారు.. “గుర్తుంచుకోండి… మీరు టీమ్‌గా కలిసి పని చేస్తే మీరు ఎల్లప్పుడూ మరింత ప్రభావవంతంగా ఉంటారు.. అని పేర్కొంటూ #MondayMorning హ్యాష్‌ట్యాగ్‌ని జోడించాడు. ఇక, మహీంద్రా తాజాగా చేసిన ఈ ట్వీట్‌ వైరల్‌గా మారిపోయింది.

Exit mobile version