వ్యాపారరంగంలో నిత్యం బిజీగా ఉండే ఆనంద్ మహీంద్రా ఇప్పుడు రూరల్ ఇండియాపై దృష్టి సారించారు. రూరల్ ఇండియాలో రైతులు పండించిన పంటను చిన్న చిన్న వాహనాలపై ఓవర్ లోడ్ చేసుకొని తీసుకొని వెళ్తుంటారు. డిమాండ్ ఉన్న వాహనాల్లో పంటను పెద్ద ఎత్తున ఓవర్ లోడ్ చేసుకొని వెళ్తుంటారని, ఓవర్ లోడ్ కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. రూరల్ ఇండియాలో డిమాండ్ ఉన్న వాహనాలను ఓవర్ లోడ్‌కు తగిన విధంగా మార్పులు చేయాలని, డిజైన్ మార్పులపై ఇంజనీర్లు దృష్టి సారించాలని ట్వీట్ చేశారు. రూరల్ ఇండియాలో చిన్న చిన్న వాహనాలకు డిమాండ్ అధికంగా ఉంటుంది. ఎక్కువగా కొనుగోలు చేసే వాహనాలు ఓవర్ లోడ్ చేసుకోవడానికి అనుకూలంగా మార్చేలా చూడాలని ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్ వైరల్ అవుతున్నది.
Read: అరుణాచల్‌లో అద్భుతం: 10 వేల అడుగుల ఎత్తులో 104 అడుగుల జాతీయపతాకం…
