NTV Telugu Site icon

అదిరిపోయే ఫీచ‌ర్స్ తో ఇండియాలో మ‌రో ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌… కేవ‌లం 4 గంట‌ల్లోనే

దేశంలో ఎల‌క్ట్రిక్ వాహ‌నాల వినియోగం రోజురోజుకు పెరిగిపోతున్న‌ది. ఇప్ప‌టికే అనేక స్టార్ట‌ప్ కంపెనీలు ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను లాంచ్ చేశారు. చేస్తూనే ఉన్నాయి. టూవీల‌ర్స్‌తో పాటు, కార్లను కూడా ఇండియాలో లాంచ్ చేస్తున్నారు. వాహ‌నాల వినియోగం పెర‌గ‌డంతో వీటికి డిమాండ్ కూడా పెరిగింది. దేశంలో మ‌రో ఏఎంఓ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ జ‌న్నీ ప్ల‌స్ వాహ‌నాన్ని లాంచ్ చేసింది. 60 వీ 40 ఎహెచ్ బ్యాట‌రీతో ఈ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌ను లాంచ్ చేశారు. ఇందులో అదిరిపోయే ఫీచ‌ర్లు ఉన్నాయి. క్రూయిజ్ కంట్రోల్ స్విచ్‌తో పాటు, యాంటి థెఫ్ట్ అలారం సిస్ట‌మ్ కూడా ఇందులో ఉన్న‌ది.

Read: లైవ్‌: యాదాద్రిలో సీఎం కేసీఆర్ పర్యటన

అంతేకాదు, ఈ జ‌న్నీ ప్ల‌స్ స్కూట‌ర్ బ్యాట‌రీని ఒక‌సారి ఛార్జ్ చేస్తే గ‌రిష్టంగా 120 కిమీ వ‌ర‌కు ప్ర‌యాణం చేస్తుంది. బ్యాట‌రీని ఒక‌సారి ఛార్జ్ చేయ‌డానికి గ‌రిష్టంగా నాలుగు గంట‌ల స‌మ‌యం ప‌డుతుంద‌ని కంపెనీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర రూ. 1.10 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉంటుంద‌ని, రెడ్‌, బ్లాక్‌, గ్రే, బ్లాక్‌, వైట్ వంటి ఐదు రంగుల్లో ఈ బైక్ అందుబాటులో ఉన్న‌ట్టు కంపెనీ వ‌ర్గాలు పేర్కొన్నాయి.