NTV Telugu Site icon

Amazon: ఈ తేదీ నుంచి ఆర్డర్ల డెలివరీకి రూ. 2000 నోటును అంగీకరించదు..

Amazon

Amazon

Amazon: ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ తన ఆర్డర్ల క్యాష్ ఆన్ డెలివరీలకు రూ. 2000 నోట్లను ఇవ్వడానికి స్వస్తి చెప్పనుంది. ఈ నోట్లను స్వీకరించేందుకు తుది గడువు ప్రకటించింది. రూ. 2000 నోట్లను డిపాజిట్ చేసుకునేందుకు సమయం దగ్గర పడుతున్న సమయంలో ఈ ప్రకటననను వెలువరించింది. సెప్టెంబర్ 19 నుంచి క్యాష్ ఆన్ డెలివరీలకు రూ. 2000 నోట్లను తీసుకోమని స్పష్టం చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) రూ.2000 నోట్లను మార్చుకునేందుకు సెప్టెంబర్ 30ని తుది గడువుగా పేర్కొంది.

సెప్టెంబర్ 19,2023 నుంచి మేము క్యాష్ ఆన్ డెలివరీలపై రూ. 2000 కరెన్సీ నోట్లను అంగీకరిచమని ఫ్రీక్వెన్టీ ఆక్సుడ్ క్వశ్చన్(FAQs)లలో పేర్కొంది. అయితే థర్డ్ పార్టీ కొరియర్ పార్ట్‌నర్ ద్వారా ఆర్డర్లు డెలివరీలు చేయబడితే, క్యాష్ ఆన్ డెలివరీ కోసం రూ. 2000 నోట్లను అంగీకరించబడవచ్చు అని తెలిపింది.

Read Also: Tata Nexon facelift: నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్.. వేరియంట్ వారీగా రేట్లను ప్రకటించిన టాటా మోటార్స్..

ఈ ఏడాది మేలో ఆర్బీఐ రూ. 2000 నోట్లను నిలిపివేసినట్లు ప్రకటించింది. నోట్లను మార్చుకోవడానికి, డిపాజిట్ చేయడానికి సెప్టెంబర్ 30 వరకు గడువు విధించింది. చెలామణిలో ఉన్న రూ. 2000 నోట్లు మే 19 వరకు 93 శాతం బ్యాంకులకు చేరిందని సెప్టెంబర్ 1న ఆర్బీఐ ప్రకటించింది. ఆగస్టు 31 వరకు చెలామణి నుండి తిరిగి వచ్చిన రూ.2000 నోట్ల మొత్తం విలువ రూ.3.32 లక్షల కోట్లు అని సెంట్రల్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. వివిధ బ్యాంకుల నుండి వచ్చిన సమాచారం ప్రకారం రూ.2000 డినామినేషన్‌లో ఉన్న మొత్తం నోట్లలో 87 శాతం డిపాజిట్ల రూపంలో ఉండగా, మిగిలిన 13 శాతం ఇతర డినామినేషన్ నోట్లలోకి మార్చబడ్దాయి.