NTV Telugu Site icon

Amazon Prime Video: అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో కీలక నిర్ణయం.. ఆదాయం కోసం కొత్త ప్లాన్‌!

Amazon Prime Video

Amazon Prime Video

ప్రముఖ వీడియో స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో కీలక నిర్ణయం తీసుకుంది. ఆదాయాన్ని పెంచుకొనేందుకు సిద్ధమైంది. ఇప్పటివరకు తన స్ట్రీమింగ్‌ వేదికగా ఎటువంటి యాడ్స్‌ అందించని ప్లాట్‌ఫామ్‌ త్వరలోనే ప్రకటనలు ఇచ్చేందుకు చూస్తోంది. అమెజాన్‌ తన వెబ్‌సైట్‌ ద్వారా ప్రకటించింది. ఒకవేళ యాడ్‌- ఫ్రీ కంటెట్‌ కావాలనుకొనేవారు అధిక ధరతో తీసుకొచ్చే సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ ఎంచుకోవాల్సి ఉంటుంది.

ఇది కూడా చదవండి: Minister Nadendla Manohar: అధిక ధరకు సరుకులు విక్రయిస్తే కఠిన చర్యలు.. సూపర్ మార్కెట్‌ను తనిఖీ చేసిన మంత్రి

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ఇప్పటికే ఆస్ట్రేలియా, కెనడా, మెక్సికో, బ్రిటన్‌, అమెరికాతో పాటు పలు యూరోపియన్‌ దేశాల్లోని యూజర్లకు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో యాడ్స్‌ను ప్రచారం చేస్తోంది. 2025 నాటికి ఈ ప్రకటనల్ని భారత్‌లోనూ ప్రవేశపెట్టాలని చూస్తోంది. అంటే ఇకపై సినిమాలు, షోలు చూస్తున్న సమయంలో ఈ యాడ్స్ దర్శనమివ్వనున్నాయి. ఒకవేళ ప్రకటనలు వద్దనుకుంటే యాడ్‌-ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇతర వేదికల కంటే యాడ్స్‌ తక్కువగానే ఉంటాయని కంపెనీ తెలిపింది. అయితే కొత్త ప్లాన్‌ వివరాలు త్వరలో ప్రకటించనున్నట్లు వెల్లడించింది.

ఇది కూడా చదవండి: Haryana Elections: ఏంటి ఇది..? హర్యానాలోని 20 స్థానాల్లో రీ-ఎలక్షన్ పిటిషన్‌పై సుప్రీం ఆగ్రహం..