Site icon NTV Telugu

Amazon Primeday : భారీ ఆఫర్లతో రానున్న అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్‌

Amazon Prime Day

Amazon Prime Day

కొత్త కొత్త ఆఫర్లతో వినియోగదారులను సంతృప్తి పరిచే బాటలో ముందుటుంది ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా అమెజాన్‌ ప్రైమడ్‌ డేసేల్‌తో ముందుకు రానుంది. భారీ భారీ ఆఫర్లతో మరోసారి తన వియోగదారులకు అందుబాటులోకి రానుంది. ఈ నెల 23,24 తేదీల్లో అమెజాన్‌ ప్రైమ్‌ డే నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ సేల్ లో వివిధ రకాల వస్తువులపై భారీ తగ్గింపు ఉండనుంది. ఈ ఆఫర్ కేవలం అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ తీసుకున్న వాళ్లకు మాత్రమే వర్తిస్తుందని అమెజాన్‌ తెలిపింది. అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ తీసుకోని వారు.. ఈ ఆఫర్లు పొందలేరని.. కొత్తగా ఈ ఆఫర్ తీసుకోవాలనుకునే వారు రూ. 1499 ప్యాక్ తో ఏడాది పాటు రూ.179 ప్యాక్‌తో నెల పాటు అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చని అమెజాన్‌ పేర్కొంది.

వైఎస్సార్‌ జయంతి స్పెషల్‌.. ఆయన గురించి ఆసక్తికర విషయాలు..

అమెజాన్ ప్రైమ్ డే సేల్ ప్రకటించడంతో చాలామంది ఇప్పటి నుంచే ఏమేమి కొనుగోలు చేయాలో ప్లాన్ చేసుకుంటున్నారు. జూలై 23న ఈ అమెజాన్ ప్రైమ్ డే సేల్ ప్రారంభం కానుంది. మరుసటి రోజు రాత్రి 11.59 గంటలకు ఈ సేల్ ఆఫర్ ముగియనుంది. అమెజాన్ ప్రైమ్ డే సేల్ లో భాగంగా స్మార్ట్ ఫోన్లపై 40 శాతం తగ్గింపు అందుబాటులో ఉండనుంది. హెడ్ ఫోన్స్‌, ల్యాప్ టాప్స్ పై 75 శాతం వరకు తగ్గింపు ఉండనుంది. ఇక అమెజాన్ లో కొనగోలు చేసిన వస్తువలపై నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం, వాటితో పాటు.. ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉండనుందని అమెజాన్‌ వెల్లడించింది.

 

Exit mobile version