వైఎస్సార్‌ పూర్తి పేరు.. యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి.

 1949 జూలై 8న వైఎస్ఆర్ జిల్లా, జమ్మలమడుగులోని సి.ఎస్.ఐ. కాంప్‌బెల్ మిషన్ ఆసుపత్రిలో జన్మించారు.

గుల్బర్గాలోని మహాదేవప్ప రాంపూరే వైద్య కళాశాలలో వైద్యవృత్తిని అభ్యసిస్తుండగానే కళాశాల విద్యార్థిసంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరించారు.

1978లో తొలిసారిగా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంనుంచి శాసనసభలో అడుగుపెట్టారు రాజశేఖరరెడ్డి.

2003లో మండువేసవిలో 1460 కిలోమీటర్లు  పాదయాత్ర చేశారు రాజశేఖరరెడ్డి.

2004 మేలో జరిగిన 12వ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికస్థానాలు సాధించడంతో వైస్సార్‌ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు.

2009 ఏప్రిల్లో  ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలలో విజయం సాధించడానికి కృషిచేసి వరుసగా రెండో పర్యాయం ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు.

పులివెందుల నుంచి రెండోసారి హాట్రిక్ విజయం,  శాసనసభ్యుడిగా వైఎస్సార్‌ గెలుపొందడం ఆరవసారి.

 సెప్టెంబర్ 2, 2009న చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి హాజరవడానికి వెళ్తూ నల్లమల అడవులలో హెలికాప్టర్ ప్రమాదానికి గురై దుర్మరణం పాలయ్యారు.