Amazon: అమెజాన్‌లో మరోసారి లేఆఫ్.. ఈ సారి ఎంత మంది అంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amazon: ఆర్థికమాంద్యం భయాలు, ఆర్థిక మందగమన పరిస్థితులు ప్రపంచాన్ని భయపెడుతున్నాయి. ముఖ్యంగా టెక్ రంగంలో ఉద్యోగులకు భద్రత లేకుండా పోయింది. గతేడాది నుంచి ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజ కంపెనీలు వేల సంఖ్యలో తమ ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. ఈ లేఫ్స్ పర్వం ఇప్పటికీ కొనసాగుతోంది. తాజాగా అమెజాన్ తన గేమింగ్ డివిజన్ నుంచి 180 మంది ఉద్యోగును తొలగించిందని నివేదికలు చెబుతున్నాయి. అమెజాన్ గత వారం తన స్ట్రీమింగ్ మ్యూజిక్ మరియు పోడ్కాస్ట్ విభాగంలో ఉద్యోగాలను తగ్గించడం ప్రారంభించింది. వారంలోనే రెండోసారి ఉద్యోగులను తీసేసింది. దీనికి ముందు అమెజాన్ గేమ్స్ ఏప్రిల్ నెలలో 100 మందిని తొలగించింది.
Read Also: Chinta Mohan: తెలంగాణ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ బీజేపీకి మద్దతిచ్చి తప్పు చేశారు..
Also Read
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
- Repo Rate Hike: పండుగ పూట లోన్ EMI లు పెరుగుతాయా? అక్టోబర్ 7న రిజర్వ్ బ్యాంక్ ఏం చేయబోతుంది!
- రూ.2,254 నుంచి రూ.984! ఒక్క దెబ్బతో 5 ఏళ్ల లాభాలు స్వాహా.. PB ఫిన్‌టెక్‌ను ముంచేసిందెవరు?
- SSY, PPF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కొత్త వడ్డీ రేట్లు ఇవే! మీ పెట్టుబడిపై ఎంత లాభం వస్తుందంటే?
అమెజాన్ ఈ త్రైమాసికంలో మంచి వృద్ధిరేటు కనబరిచినప్పటికీ.. ఉద్యోగుల కోతలను కొనసాగిస్తోంది. గతేడాది అమెజాన్ 27000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించింది. గత వారం అమెజాన్ మ్యూజిక్‌లో కొంత మందిని తొలగిస్తూ ఈ మెయిల్స్ పంపింది. సంస్థాగత అవసరాలు పున:పరిశీలనలో భాగంగా కస్టమర్ల సంతృప్తి, దీర్ఘకాలిక వ్యాపార అవసరాల ప్రాధాన్యత కారణంగా తాజా తొలగింపులు జరుగుతున్నట్లు అమెజాన్ ప్రతినిధి తెలిపారు. అమెజాన్ మాత్రమే కాదు.. టెక్ దిగ్గజాలైన మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు కూడా వేలల్లో తమ ఉద్యోగులను తొలగించాయి. లాభాలు తగ్గడంతో ఖర్చులను అదుపులో పెట్టుకునేందుకే అని కంపెనీలు ప్రకటించాయి.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..