NTV Telugu Site icon

Amazon: అమెజాన్‌లో మరోసారి లేఆఫ్.. ఈ సారి ఎంత మంది అంటే..

Amazon

Amazon

Amazon: ఆర్థికమాంద్యం భయాలు, ఆర్థిక మందగమన పరిస్థితులు ప్రపంచాన్ని భయపెడుతున్నాయి. ముఖ్యంగా టెక్ రంగంలో ఉద్యోగులకు భద్రత లేకుండా పోయింది. గతేడాది నుంచి ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజ కంపెనీలు వేల సంఖ్యలో తమ ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. ఈ లేఫ్స్ పర్వం ఇప్పటికీ కొనసాగుతోంది. తాజాగా అమెజాన్ తన గేమింగ్ డివిజన్ నుంచి 180 మంది ఉద్యోగును తొలగించిందని నివేదికలు చెబుతున్నాయి. అమెజాన్ గత వారం తన స్ట్రీమింగ్ మ్యూజిక్ మరియు పోడ్‌కాస్ట్ విభాగంలో ఉద్యోగాలను తగ్గించడం ప్రారంభించింది. వారంలోనే రెండోసారి ఉద్యోగులను తీసేసింది. దీనికి ముందు అమెజాన్ గేమ్స్ ఏప్రిల్ నెలలో 100 మందిని తొలగించింది.

Read Also: Chinta Mohan: తెలంగాణ ఎన్నికల్లో పవన్‌ కళ్యాణ్‌ బీజేపీకి మద్దతిచ్చి తప్పు చేశారు..

అమెజాన్ ఈ త్రైమాసికంలో మంచి వృద్ధిరేటు కనబరిచినప్పటికీ.. ఉద్యోగుల కోతలను కొనసాగిస్తోంది. గతేడాది అమెజాన్ 27000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించింది. గత వారం అమెజాన్ మ్యూజిక్‌లో కొంత మందిని తొలగిస్తూ ఈ మెయిల్స్ పంపింది. సంస్థాగత అవసరాలు పున:పరిశీలనలో భాగంగా కస్టమర్ల సంతృప్తి, దీర్ఘకాలిక వ్యాపార అవసరాల ప్రాధాన్యత కారణంగా తాజా తొలగింపులు జరుగుతున్నట్లు అమెజాన్ ప్రతినిధి తెలిపారు. అమెజాన్ మాత్రమే కాదు.. టెక్ దిగ్గజాలైన మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు కూడా వేలల్లో తమ ఉద్యోగులను తొలగించాయి. లాభాలు తగ్గడంతో ఖర్చులను అదుపులో పెట్టుకునేందుకే అని కంపెనీలు ప్రకటించాయి.