దేశీయ స్టాక్ మార్కెట్‌లో లాభాల జోరు కొనసాగుతోంది. గత వారం మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలకు ముందు సూచీల్లో మంచి హుషారు కనిపించింది. ఇక ఈ వారం ప్రారంభంలో అంతర్జాతీయ మార్కెట్‌లోని సానుకూల సంకేతాలు, మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి విజయం సాధించడంతో మార్కెట్‌కు మరింత కొత్త జోష్ వచ్చింది. ఉదయం మార్కెట్ ప్రారంభంలోనే భారీ లాభాలతో మొదలైన సూచీలు చివరిదాకా గ్రీన్‌లోనే కొనసాగాయి. గతంలో నష్టపోయిన ఇన్వెస్టర్ల సంపద తిరిగి రికవరీ అవుతోంది. సెన్సెక్స్ 992 పాయింట్లు లాభపడి 80,109 దగ్గర ముగియగా. నిఫ్టీ 314 పాయింట్లు లాభపడి 24, 221 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే రూ.84.28 దగ్గర ముగిసింది.
ఇది కూడా చదవండి: Pizza: డీప్ ఫ్రైడ్ ఫ్రాగ్‌తో కూడిన పిజ్జా.. షాక్ అవుతున్న కస్టమర్లు..!
నిఫ్టీలో ఒఎన్‌జీసీ, శ్రీరామ్ ఫైనాన్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, ఎల్‌అండ్‌టి భారీ లాభాల్లో కొనసాగగా.. జెఎస్‌డబ్ల్యు స్టీల్, ఇన్ఫోసిస్, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, సన్ ఫార్మా నష్టపోయాయి. బీఎస్‌ఈలో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు 1.5 శాతం చొప్పున పెరిగాయి. ఆయిల్ అండ్ గ్యాస్, రియల్టీ, క్యాపిటల్ గూడ్స్, పీఎస్‌యూ బ్యాంక్‌లు 2-4 శాతం మేర పెరిగాయి.
ఇది కూడా చదవండి: Ponnam Prabhakar : త్వరలో రేషన్ కార్డులు అందజేస్తాం