Airtel Launch Rs 289 Prepaid Recharge Plan: టెలికాం దిగ్గజం ‘భారతి ఎయిర్‌టెల్’ తమ కస్టమర్ల కోసం కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రారంభించింది. కంపెనీ తన ప్రీపెయిడ్ పోర్ట్‌ఫోలియోలో తాజాగా రూ. 289 (Airtel Rs 289 Plan) ప్లాన్‌ను చేర్చింది. రోజువారీ డేటాతో పాటు ఇతర ప్రయోజనాల కోసం చూస్తున్న వినియోగదారులకు ఈ ప్లాన్ సరిపోతుంది. ఎయిర్‌టెల్ రూ. 289 వాలిడిటీ 35 రోజుల వరకు ఉంటుంది. భారతీ ఎయిర్‌టెల్ వెబ్‌సైట్ మరియు మొబైల్ యాప్‌లో ఈ ప్లాన్ అందుబాటులో ఉంది. ఇక నుంచి ఎయిర్‌టెల్ వినియోగదారులు ఈ ప్లాన్‌ను రీఛార్జ్ చేసుకోవచ్చు.
Airtel Rs 289 Plan Details:
రూ. 289 ప్లాన్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్. ఇది 35 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఈ ప్లాన్‌లో వినియోగదారులు 4GB డేటా, 300 SMS మరియు అపరిమిత వాయిస్ కాలింగ్ సౌకర్యాన్ని పొందుతారు. దీనితో పాటు అపోలో 24×7 సర్కిల్, ఉచిత హెలోట్యూన్స్ మరియు ఉచిత వింక్ మ్యూజిక్ వంటి ఎయిర్‌టెల్ థాంక్స్ యొక్క అదనపు ప్రయోజనాలు కూడా వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌ను ఉపయోగించడం ద్వారా రోజుకు రూ. 8.25 ఖర్చు అవుతుంది.
Also Read: Langur Viral Video: అచ్చు మనిషి లానే.. పానీపూరి ఇష్టంగా తింటున్న కొండముచ్చు! వీడియో చూస్తే షాకే
Airtel Rs 199 Plan Details:
రూ. 289 ప్లాన్ కంటే తక్కువ రోజుల చెల్లుబాటు కావాలనుకుంటే.. రూ. 199 ప్లాన్ కూడా ఉంది. ఈ ప్లాన్‌లో 30 రోజుల వాలిడిటీ అందుబాటులో ఉంటుంది. ఎయిర్‌టెల్ థాంక్స్ వంటి ప్రయోజనాలను పొందవచ్చు. రూ. 199 ప్లాన్‌లో వినియోగదారులు 3GB డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు 300 SMSలను పొందుతారు. రూ. 199 ప్లాన్ ఎంచుకుంటే.. రోజువారీ ధర రూ. 6.63గా ఉంటుంది. అయితే రూ. 199 ప్లాన్‌లో 5G సదుపాయం అందుబాటులో ఉండదు.
Airtel 5G Service:
భారతీ ఎయిర్‌టెల్ దేశవ్యాప్తంగా 5G సేవలను వేగంగా విస్తరిస్తోంది. వినియోగదారులకు అపరిమిత 5G డేటాను ఆస్వాదించే సౌకర్యాన్ని కూడా అందిస్తోంది. మీరు రూ. 239 లేదా అంతకంటే ఎక్కువ ప్రీపెయిడ్ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే.. ఎయిర్‌టెల్ అపరిమిత 5G డేటాను ఆస్వాదించవచ్చు.
Also Read: Lemon For Diabetes: డయాబెటిక్ పేషెంట్లకు నిమ్మరసం ఎంతో మేలు.. ఐదు రకాలుగా తీసుకోవచ్చు!