NTV Telugu Site icon

Air India Express: ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌‌లో ఏఐఎక్స్‌ కనెక్ట్‌ విలీనం

Airindiaexpress

Airindiaexpress

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో ఏఐఎక్స్ కనెక్ట్ విలీన ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. పౌర విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ ఈ విషయాన్ని మంగళవారం వెల్లడించింది. అక్టోబర్‌ 1 నుంచి ఏఐఎక్స్‌ కనెక్ట్‌ కింద నమోదైన విమానాలన్నీ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ పేరుతో నడవనున్నాయి. విలీనం అనంతరం కార్యకలాపాలను పరిశీలిస్తామని డీజీసీఏ తెలిపింది.

ఎయిరిండియా-విస్తారా విలీన ప్రక్రియ జరుగుతోందని డీజీసీఏ తెలిపింది. ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌, విస్తారా, ఏఐఎక్స్‌ కనెక్ట్‌.. ఈ నాలుగు టాటా గ్రూపునకు చెందిన విమాన సంస్థలే. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో ఏఐఎక్స్‌ కనెక్ట్‌ను.. ఎయిరిండియాలో విస్తారాను విలీనం చేయాలని టాటా గ్రూప్‌ నిర్ణయించింది. ప్రస్తుతం ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, ఏఐఎక్స్‌ కనెక్ట్‌లు రోజువారీగా సుమారు 400 విమాన సర్వీసులు నడుపుతున్నాయి. విలీన సంస్థలో సుమారు 6,000 మంది ఉద్యోగులు ఉంటారు. ఇక ఎయిరిండియాలో విస్తారా విలీన ప్రక్రియ నవంబర్‌ నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది.

ఈ విలీన ప్రక్రియతో దేశంలో పెరుగుతున్న విమాన ప్రయాణ డిమాండ్‌ను కొంత మేర తగ్గించగలదు. నవంబర్ 12 లోపు విస్తారా కూడా ఎయిరిండియాలో విలీనం అయ్యే ఛాన్సుంది. ఈ ప్రక్రియ కూడా పూర్తైతే మరిన్ని సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ ప్రక్రియ పూర్త అవ్వడానికి డీజీసీఏతో కలిసి పని చేయడానికి ఎదురుచూస్తున్నట్లు ఎయిరిండియా ఛైర్మన్ తెలిపారు. 2022లో ట్రాటా గ్రూప్ ఎయిరిండియాను స్వాధీనం చేసుకుంది. అప్పటి నుంచి ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది.