వేరుశెనగలు ఆరోగ్యానికి మంచివి.. ఇందులో ప్రోటీన్, ఫైబర్, విటమిన్ ఇ, ఆరోగ్యకరమైన కొవ్వులు, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. 

యూఎస్ వ్యవసాయ శాఖ నివేదిక ప్రకారం.. 2022-23లో ప్రపంచవ్యాప్తంగా 49.8 మిలియన్ మెట్రిక్ టన్నుల వేరుశెనగ ఉత్పత్తి చేశారు.  

భారతదేశం గత కొన్ని ఏళ్లలో వేరుశెనగ ఉత్పత్తిని గణనీయంగా పెంచింది. ప్రపంచంలోనే అత్యుత్తమ వేరుశెనగకు భారత్ పేరుగాంచింది.

 భారతదేశంలో 6.3 మిలియన్ మెట్రిక్ టన్నుల వేరుశెనగ ఉత్పత్తి చేయబడింది.

 గుజరాత్‌లో అత్యధికంగా పండిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక వంటి ఇతర రాష్ట్రాల్లో కూడా వేరుశనగను పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారు.

 వేరుశనగ సాగులో  చైనా అగ్రస్థానంలో ఉంది.  చైనాలో ఏటా18.3 మిలియన్ మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అవుతుంది.

చైనీస్ వేరుశెనగలో 70 శాతం షాన్‌డాంగ్, హెనాన్, హెబీ, గ్వాంగ్‌డాంగ్,  జియాంగ్సు ప్రావిన్సులలో పండిస్తున్నారు.  

వేరుశెనగలో కూడా నైజీరియా పేరు తెచ్చుకుంటోంది. 2022-23లో ఉత్పత్తి 6.4 శాతం పెరిగి 4.5 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరుకుంది.  

 అర్జెంటీనా, అమెరికా, సూడాన్, సెనెగల్, బ్రెజిల్ కూడా వేరుశెనగను ప్రధానంగా ఉత్పత్తి చేసే దేశాల జాబితాలో ఉన్నాయి.