NTV Telugu Site icon

Air India: ఎయిర్‌బస్‌తో ఎయిరిండియా భారీ డీల్.. 250 కొత్త విమానాల కోసం ఒప్పందం..?

Air India

Air India

Air India Finalises Deal With Airbus: టాటాల చేతికి వచ్చిన తర్వాత ఎయిర్ ఇండియాను మరింత మెరుగ్గా తీర్చిదిద్దాలని సంస్థ భావిస్తోంది. ఇందులో భాగంగా ప్రముఖ విమానాల తయారీ సంస్థ ఎయిర్‌బస్‌ తో కీలక ఒప్పందం చేసుకున్నట్లు నివేదిక చెబుతున్నాయి. అయితే అధికారికంగా ఎయిర్ ఇండియా ఎలాంటి ప్రకటన చేయలేదు.. వచ్చే వారం ఈ ఒప్పందంపై కీలక ప్రకటన చేస్తుందని భావిస్తున్నారు. ఎయిర్‌బస్‌ తో 250 విమానాల కోసం ఆర్డర్ ఖరారు చేసిందని సమాచారం. దీంతో పాటు సుమారు 200 విమానాల కోసం బోయింగ్ తో ఎయిర్ లైన్స్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి.

Read Also: Vitamin D: విటమిన్-డితో తగ్గనున్న టైప్-2 డయాబెటిస్ ముప్పు..

ఎయిరిండియాను టాటా గ్రూపు యాజమాన్యం దక్కించుకున్న తర్వాత కార్యకలాపాలతో పాటు విమానాలను కూడా విస్తరించాలని చూస్తోంది. ఇటీవల ఎయిరిండియా చీఫ్ క్యాంప్ బెల్ విల్సన్ మాట్లాడుతూ.. కొత్త విమానాల కోసం తమ సంస్థ ఆర్డర్లను ఖారారు చేస్తున్నట్లు తెలిపారు. చివరిసారిగా ఎయిరిండియా 16 ఏళ్ల క్రితం కొత్త విమానాలను కొనుగోలు చేసింది. 2005 నుంచి ఒక్క విమానాన్ని కూడా కొనుగోలు చేయలేదు. చివరిసారిగా 111 విమానాల కోసం బోయింగ్ తో 68, ఎయిర్ బస్ తో 43 విమానాల కోసం 10.8 బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని చేసుకుంది.

తాజాగా ఎయిర్ బస్ 250 విమానాల ఒప్పందంలో ఏ350 విమానాలు 40 ఉండే అవకాశం ఉంది. ఈ విమానాలను నిర్వహించే మొదటి భారతీయ విమానయాన సంస్థగా ఎయిర్ ఇండియా నిలిచిపోనుంది. గతంలో ఎయిరిండియా ఏ330 విమానాలను నడిపింది. ఏవియేషన్ కన్సల్టెన్సీ పీఏపీఏ ప్రకారం 2024 నాటికి భారతీయ ఎయిర్ లైన్స్ సంస్థలు 1700 విమానాల కోసం ఆర్డర్లు చేసే అవకాశం ఉంది. దీంట్లో 500 విమానాలను ఎయిర్ ఇండియానే కొనుగోలు చేసే అవకాశం ఉందని తెలిపింది.

Show comments