AC Prices Hike: ఏసీలు కొనాలంటే జేబులు ఖాళీ అవ్వాల్సిందే.. 15 శాతం పెరగనున్న ధరలు

C

C

AC Prices Hike: రాగి భారీగా ధరలు పెరిగిపోవడం, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ తగ్గడంతో ఈ ఏడాది ఎయిర్‌ కండిషనర్ల ధరల 5 నుంచి 15 శాతం మేర పెరిగే ఛాన్స్ ఉందని వోల్టాస్‌ మేనేజింగ్ డైరెక్టర్ ముకుందన్ మేనన్ వెల్లడించారు. గత సంవత్సరం ఏసీ అమ్మకాలు తక్కువగానే ఉన్నప్పటికీ.. ఈ ఏడాది మాత్రం విక్రయాల్లో 15-20 శాతం మేర వృద్ధి నమోదు అయ్యే ఛాన్స్ ఉందని అంచనా వేశారు.

Read Also: Salman Ali Agha: బాగా ఆడాం, రోజు అల్లాహ్ మా వైపు లేడు.. ఇంగ్లాండ్‌ ఓటమిపై పాక్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

కాగా, విద్యుత్తు వినియోగ సామర్థ్యం పెంచేందుకు ఉద్దేశించిన ఎనర్జీ లేబుల్ మార్పులు కూడా ఏసీ ధరల పెరుగుదలకు దోహదం చేసే అవకాశం ఉందని వోల్టాస్ ఎండీ ముకుందన్‌ తెలిపారు. ముఖ్యంగా ఏసీల తయారీలో వినియోగించే రాగి, అల్యూమినియం, స్టీల్‌ వల్లే ధరలు 5 నుంచి 15 శాతం మేర పెరుగుతాయి.. గతేడాది రాగి ధర టన్నుకు 8,500 డాలర్లుగా ఉండగా.. ఈ ఏడాది 12 వేల నుంచి 13 వేల డాలర్లకు చేరుకుంది. ఏసీ తయారీలో రాగి వినియోగం ఎక్కువ కాబట్టి వీటి ధరలపై దీని ప్రభావం అధికంగా ఉంటుందన్నారు. ఇప్పటికీ ఏసీలకు సంబంధించిన కొన్ని విడి భాగాలను మనం దిగుమతి చేసుకుంటున్నాం, రూపాయి విలువ పతనంతో ఏసీ ధరలపై పడుతుంది.

Read Also: Mother Kills Daughter: ప్రియుడు కోసం కన్నకూతురిని కడతేర్చిన తల్లి.. నేడు చిన్నారి మృతదేహానికి పోస్టుమార్టం

అయితే, మార్కెట్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఎయిర్‌ కండిషనర్ల ధరలు 5-15 శాతం పెంచాలని కంపెనీ ఫిక్స్ అయినట్లు మేనన్ వెల్లడించారు. ఏసీల విక్రయాలు 15-20 శాతం పెరిగే ఛాన్స్ ఉండటంతో.. తమిళనాడు, ఉత్తరాఖండ్‌లోని తమ ప్లాంట్లలో ఉత్పత్తి సామర్థ్యాన్ని 30 లక్షలకు పెంచినట్లు పేర్కొన్నారు. కంప్రెషర్లు, మోటార్లు, పీసీబీలు, కాపర్‌, అల్యూమినియం విడిభాగాలను రాబోయే రెండేళ్లలో 70 నుంచి 90 శాతం లోకలైజ్‌ చేయబోతున్నట్లు తెలిపారు. ఇక, కొత్త ఉత్పత్తుల, సేల్స్‌ అండ్‌ సర్వీస్‌ను మరింత పెంచుతాం.. భారత్‌ నుంచి ఎగుమతుల కోసం కేంద్రంతో కలిసి పని చేస్తున్నాం.. వోల్టాస్ ధరలు పెంచితే ఇతర కంపెనీలూ అదే బాట పట్టే పయనించే ఛాన్స్ ఉంది.