AC Prices Hike: ఏసీలు కొనాలంటే జేబులు ఖాళీ అవ్వాల్సిందే.. 15 శాతం పెరగనున్న ధరలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AC Prices Hike: రాగి భారీగా ధరలు పెరిగిపోవడం, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ తగ్గడంతో ఈ ఏడాది ఎయిర్ కండిషనర్ల ధరల 5 నుంచి 15 శాతం మేర పెరిగే ఛాన్స్ ఉందని వోల్టాస్ మేనేజింగ్ డైరెక్టర్ ముకుందన్ మేనన్ వెల్లడించారు. గత సంవత్సరం ఏసీ అమ్మకాలు తక్కువగానే ఉన్నప్పటికీ.. ఈ ఏడాది మాత్రం విక్రయాల్లో 15-20 శాతం మేర వృద్ధి నమోదు అయ్యే ఛాన్స్ ఉందని అంచనా వేశారు.
Also Read
- Gautam Adani: అంబానీని దాటేసిన అదానీ.. మళ్లీ దేశంలోనే నంబర్ 1 ధనవంతుడిగా రికార్డ్!
- Gas Subsidy: వారందరికీ గ్యాస్ సబ్సిడీ బంద్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్..
- Pine Labs: నెల రోజుల్లో 25% ప్రాఫిట్.. మరో 30% పెరిగే ఛాన్స్ ఉందట!
- Electric Scooter: ఒక్కసారి చార్జ్ చేస్తే 400 కి.మీ వెళ్లొచ్చు.. ఆఫీస్‌కు వెళ్లేవారికి బెస్ట్ ఇ-స్కూటర్ ఇదే..
కాగా, విద్యుత్తు వినియోగ సామర్థ్యం పెంచేందుకు ఉద్దేశించిన ఎనర్జీ లేబుల్ మార్పులు కూడా ఏసీ ధరల పెరుగుదలకు దోహదం చేసే అవకాశం ఉందని వోల్టాస్ ఎండీ ముకుందన్ తెలిపారు. ముఖ్యంగా ఏసీల తయారీలో వినియోగించే రాగి, అల్యూమినియం, స్టీల్ వల్లే ధరలు 5 నుంచి 15 శాతం మేర పెరుగుతాయి.. గతేడాది రాగి ధర టన్నుకు 8,500 డాలర్లుగా ఉండగా.. ఈ ఏడాది 12 వేల నుంచి 13 వేల డాలర్లకు చేరుకుంది. ఏసీ తయారీలో రాగి వినియోగం ఎక్కువ కాబట్టి వీటి ధరలపై దీని ప్రభావం అధికంగా ఉంటుందన్నారు. ఇప్పటికీ ఏసీలకు సంబంధించిన కొన్ని విడి భాగాలను మనం దిగుమతి చేసుకుంటున్నాం, రూపాయి విలువ పతనంతో ఏసీ ధరలపై పడుతుంది.
అయితే, మార్కెట్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఎయిర్ కండిషనర్ల ధరలు 5-15 శాతం పెంచాలని కంపెనీ ఫిక్స్ అయినట్లు మేనన్ వెల్లడించారు. ఏసీల విక్రయాలు 15-20 శాతం పెరిగే ఛాన్స్ ఉండటంతో.. తమిళనాడు, ఉత్తరాఖండ్‌లోని తమ ప్లాంట్లలో ఉత్పత్తి సామర్థ్యాన్ని 30 లక్షలకు పెంచినట్లు పేర్కొన్నారు. కంప్రెషర్లు, మోటార్లు, పీసీబీలు, కాపర్, అల్యూమినియం విడిభాగాలను రాబోయే రెండేళ్లలో 70 నుంచి 90 శాతం లోకలైజ్ చేయబోతున్నట్లు తెలిపారు. ఇక, కొత్త ఉత్పత్తుల, సేల్స్ అండ్ సర్వీస్‌ను మరింత పెంచుతాం.. భారత్ నుంచి ఎగుమతుల కోసం కేంద్రంతో కలిసి పని చేస్తున్నాం.. వోల్టాస్ ధరలు పెంచితే ఇతర కంపెనీలూ అదే బాట పట్టే పయనించే ఛాన్స్ ఉంది.
తాజావార్తలు
-
Virat Kohli-Rohit Sharma: బరిలోకి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. సెప్టెంబర్ 27 నుంచే సమరం..
-
Amaravati: రాజధాని నిర్మాణంలో మరో కీలక అడుగు.. ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్‌కు ఫౌండేషన్
-
Ganesh Visarjan : గణేష్ నిమజ్జనానికి సెలవు.. ఆ రోజు మాత్రం పని.!
-
Sumalatha: జానీ మాస్టర్ భార్య సుమలతపై దాడి?
-
Submarine Deal: భారత్ ‘ఓకే’ అంటే సముద్రంలో శత్రువుల పని ఖతమే .. రూ. 90 వేల కోట్ల మెగా డీల్‌కు జర్మనీ సై..
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!