మహారాష్ట్రలో అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ), శివసేన (ఏక్‌నాథ్ షిండే) మహాయతి కూటమి ఘన విజయం సాధించడంతో బిలియనీర్ గౌతమ్ అదానీ నేతృత్వంలోని గ్రూప్ $3 బిలియన్ల ధారావి ప్రాజెక్టుకు ఉపశమనం లభించనుంది. దీని కింద ముంబైలోని మురికివాడ ధారవిని ‘ప్రపంచ స్థాయి’ జిల్లాగా పునరాభివృద్ధి పనులు షురూ అవుతాయని వార్తలు వస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీ ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (UBT), అధికారంలోకి వస్తే, ఆసియాలోనే అతిపెద్ద మురికివాడలో పునరాభివృద్ధి కోసం అదానీ గ్రూప్‌కు ఇచ్చిన మొత్తం భూమిని వెనక్కి తీసుకుంటామని, ప్రాజెక్ట్‌ను పూర్తిగా రద్దు చేస్తామని చెప్పింది. తాజా ఫలితాల్లో మహాయతి కూటమి విజయంతో ప్రాజెక్టుకు ఉపశమనం లభించనుంది.
READ MORE: Daggubati Purandeswari: ‘హమ్ సాత్ ఏక్ హై’ అనే నినాదంతో ఎన్డీఏ కూటమికి ప్రజలు పట్టం కట్టారు..
కాగా..ప్రపంచంలోనే అతి పెద్ద మురికివాడగా పేరుగాంచిన ధారావిలో రీ డెవలప్‌మెంట్ ప్రాజెక్టును అదానీ గ్రూప్ దక్కించుకున్న విషయం తెలిసిందే. మొత్తం ముగ్గురు బిడ్డర్లలో అత్యధికంగా రూ.5,069 కోట్ల బిడ్ దాఖలు చేయటంతో ఆ ప్రాజెక్టుకు అదానీకే దక్కినట్టు మహారాష్ట్ర అధికార వర్గాలు వెల్లడించాయి. డీఎల్‌ఎఫ్ రూ.2,025 కోట్లతో బిడ్ దాఖలు చేసింది. మూడో బిడ్డర్ నమన్ గ్రూప్ బిడ్‌కు అర్హత సాధించలేకపోయింది. తుది అనుమతి కోసం బిడ్ వివరాలను ప్రభుత్వానికి పంపుతామని ప్రాజెక్టు సీఈవో ఎస్వీఆర్ శ్రీనివాస్ తెలిపారు. ఇదిలా ఉండగా, 2.5 చదరపు కిలోమీటర్ల మేర విస్తీర్ణం ఉన్న ధారావి ప్రాంత అభివృద్ధి మొత్తం ప్రాజెక్టు విలువ రూ.20 వేల కోట్లు. ఇందులో భాగంగా అక్కడ నివసిస్తున్న 6.5 లక్షల మందిని పునరావాస కేంద్రాలకు తరలించి, రీ డెవలప్‌మెంట్ ప్రాజెక్టును చేపట్టాలి. ఇల్లు సహా ప్రజలకు కావాల్సిన మౌలిక, ఇతర సౌకర్యాలు కల్పించాలి.
READ MORE:Daggubati Purandeswari: ‘హమ్ సాత్ ఏక్ హై’ అనే నినాదంతో ఎన్డీఏ కూటమికి ప్రజలు పట్టం కట్టారు..