New Labor Laws India: వారానికి 4 రోజులే పని.. 3 రోజులు సెలవులు! కానీ కండిషన్స్ అప్లై..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New Labor Laws India: కార్పొరేట్ ప్రపంచంలో చాలా కాలంగా చర్చనీయాంశంగా మారిన ‘వారానికి 4 రోజుల పని విధానం’ త్వరలోనే వాస్తవరూపం దాల్చబోతోంది. కొత్త కార్మిక చట్టం అమలులోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ రంగ ఉద్యోగులు వారానికి వరుసగా మూడు రోజులు సెలవు పొందే అవకాశం రాబోతుంది. అంటే వారంలో కేవలం నాలుగు రోజులు మాత్రమే ఆఫీసుకు వెళ్తే సరిపోతుంది. వినడానికి ఇది ఎంతో సంతోషకరమైన వార్తలాగా ఉన్నప్పటికీ, దీని వెనుక ఉద్యోగుల జీవితాలపై ప్రత్యక్ష ప్రభావం చూపే కొన్ని ముఖ్యమైన కండిషన్లు ఉన్నాయి. ఆ వాటి కథ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
వరుసగా 3 రోజులు సెలవులు.. కానీ
కొత్త రూల్స్ ప్రకారం.. కంపెనీలు తమ పని సంస్కృతిలో మార్పులు చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న వారానికి 5 లేదా 6 రోజుల పని దినాల స్థానంలో 4 రోజుల విధానాన్ని కంపెనీలు ఎంచుకోవచ్చు. అయితే వారానికి మొత్తం పని గంటలలో ఎలాంటి తగ్గింపు ఉండదు. దేశంలో వారానికి గరిష్టంగా 48 గంటలు మాత్రమే పని చేయించాలనే నిబంధనను ప్రభుత్వం స్పష్టం చేసింది. దీని ప్రకారం మీరు వారానికి 4 రోజుల పని విధానాన్ని ఎంచుకుంటే.. రోజుకు కచ్చితంగా 12 గంటల పాటు ఆఫీస్‌లో పని చేయాల్సి ఉంటుంది (ఈ 12 గంటల షిఫ్ట్‌లోనే లంచ్, టీ బ్రేక్స్ కూడా ఉంటాయి). వరుసగా 3 రోజులు సెలవులు కావాలనుకునే వారికి నిజంగా ఇదొక బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తుందని చెబుతున్నారు.
Also Read
- EPFO New Portal: PF డబ్బులు ఎక్కడున్నాయో ఇక ఈజీగా తెలుసుకోండి.. EPFO కీలక మార్పులు
- Plastic Notes: దేశ కరెన్సీ చరిత్రలో మరో కీలక మార్పు.. ప్లాస్టిక్ నోట్ల ఎంట్రీకి రంగం సిద్ధం!
- Instamart CEO: ఇన్‌స్టామార్ట్ సీఈఓ రాజీనామా.. భారీగా పెరిగిన స్విగ్గీ షేర్లు..
- Johnson & Johnson: వేల కోట్ల సెటిల్మెంట్కి రెడీ అయిన ప్రపంచ దిగ్గజ కంపెనీ.. అక్షరాల రూ.52 వేల కోట్లు ఇవ్వడానికి డీల్!
ఓవర్‌టైమ్‌కు డబుల్ ధమాకా
ఈ కొత్త చట్టంలో ఉద్యోగులకు లభించిన అతిపెద్ద ఉపశమనం ఏమిటంటే.. ఏ యాజమాన్యం కూడా ఈ 12 గంటల షిఫ్ట్ విధానాన్ని ఉద్యోగులపై బలవంతంగా రుద్దడానికి వీల్లేదు. ఈ నియమం పూర్తిగా ఆప్షనల్ అని కార్మిక వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కంపెనీ యాజమాన్యం – ఉద్యోగులు ఇద్దరూ కూడా పరస్పరం అంగీకరిస్తేనే ఈ విధానాన్ని ఆఫీస్‌లో అమలు చేయాలని చెబుతున్నాయి. అంతేకాకుండా ఓవర్‌టైమ్ రూల్స్ ప్రభుత్వం మరింత కఠినతరం చేసింది. ఏదైనా కంపెనీ తమ ఉద్యోగులతో వారానికి 48 గంటల కంటే ఒక్క నిమిషం ఎక్కువ పని చేయించినా.. ఇకపై దానికి సాధారణ జీతం కంటే రెట్టింపు మొత్తాన్ని ఓవర్‌టైమ్ అలవెన్స్‌గా చెల్లించాల్సి ఉంటుంది. నూతన వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల నియమాలు ఇప్పుడు రోజువారీ షిఫ్టులకు బదులుగా, మొత్తం వారం పని గంటలపై దృష్టి సారించడం విశేషం.
ఈ కొత్త పని విధానం అనేది డిజిటల్ – నాలెడ్జ్ బేస్డ్ రంగాల ఉద్యోగులకు ఎక్కువగా ఉపయోగపడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఐటీ (IT), ఐటీఈఎస్ (ITeS), గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్స్ (GCCs), మార్కెటింగ్, డిజైన్ రంగాల్లో ప్రాజెక్ట్ ఆధారిత పనులు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడ ఇప్పటికే వర్క్ ఫ్రమ్ హోమ్, హైబ్రిడ్ మోడల్స్ బలంగా ఉన్నాయి కాబట్టి, ఈ కంపెనీలు 4 రోజుల పని విధానాన్ని సులభంగా అమలు చేయగలవు.
అమలు చేయడం కష్టతరమయ్యే రంగాలు
నాణేనికి రెండు వైపులా ఉన్నట్లు.. ఐటీ రంగానికి ఈ చట్టం అద్భుతంగా అనిపించినప్పటికీ కొన్ని రంగాలకు ఇది పెద్ద సవాలుగా మారనుందని చెబుతున్నారు. ఆసుపత్రులు, హోటళ్లు, రిటైల్, రవాణా, లాజిస్టిక్స్, తయారీ (Manufacturing) రంగాలలో 24 గంటలూ సిబ్బంది హాజరు అవసరం ఉంటుంది. దీంతో ఈ పరిశ్రమలలో రోజుకు 12 గంటల చొప్పున వారానికి 4 రోజులే పని విధానాన్ని ప్రాక్టికల్‌గా అమలు చేయడం యాజమాన్యాలకు అంత సులువు కాదనే వాదనలు వినిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Anantapur GGH: ఆస్పత్రి బిల్డింగ్ పైనుంచి పసికందును పడేసిన నానమ్మ.. శిశువు కాపాడిన వాటర్ బాటిల్!
-
200MP డ్యూయల్ కెమెరాలు, ARRI సినిమా టెక్నాలజీతో రానున్న HONOR Robot Phone..!
-
Commonwealth Games 2026: గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో భారత జోరు.. 12కు చేరిన పతకాల సంఖ్య
-
CI Suspended: ఆరోపణలు నిజమే.. సీఐ శ్రీనివాసులు రెడ్డి సస్పెండ్..!
-
Ramayana: ట్రైలర్‌కు ముందే ‘పుష్ప’ రికార్డ్ బద్దలు.. ‘రామాయణం’ మ్యూజిక్ రైట్స్‌కు రూ.75 కోట్ల డీల్!
ట్రెండింగ్
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?
-
Home Cleaning Hacks : టీ, కాఫీ కప్పుల మొండి మరకలా.? ఈ టిప్స్‌తో సులభంగా 5 నిమిషాల్లో క్లీన్ చేయండి.!
-
Clean Fridge Door Rubber: ఫ్రిజ్ డోర్ రబ్బర్‌కు మరకలా..? ఈ ట్రిక్‌తో 10 నిమిషాల్లో తలతల మెరిసిపోవాల్సిందే..!
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!