NTV Telugu Site icon

Jio Recharge Plan: 90 రోజుల వ్యాలిడిటీ.. రోజుకు 2GB డేటా.. ఉచిత OTT యాప్‌లతో అద్భుతమైన ప్లాన్

Jio

Jio

మొబైల్ యూజర్స్ కోసం రిలయన్స్ జియో తన పోర్ట్‌ఫోలియోలో బెస్ట్ రీచార్జ్ ప్లాన్స్ ను తీసుకొచ్చింది. ఇతర టెలికాం కంపెనీలతో పోలిస్తే బెనిఫిట్స్ ఎక్కువగా అందిస్తోంది. జియో మూడు నెలల వ్యాలిడిటీతో చాలా ప్లాన్స్ ను అందిస్తోంది. ఈ ప్లాన్లతో ఎక్కవ డేటా, ఉచిత ఓటీటీ యాప్ లను అందిస్తుంది. తక్కువ ధరలో ఎక్కువ రోజుల వ్యాలిడిటీ కావాలనుకునే వారికి జియోలో అదిరిపోయే రీచార్జ్ ప్లాన్ అందుబాటులో ఉంది. 90 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2 జీబీ డేటా అందుకోవచ్చు. ఓటీటీ యాప్స్ కు ఫ్రీ యాక్సెస్ అందిస్తోంది.

Also Read:All-Party MPs Meet: ప్రజా భవన్లో రేపు అన్ని పార్టీల ఎంపీల సమావేశం..

రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం 90 రోజుల వ్యాలిడిటీతో అద్భుతమైన అపరిమిత కాలింగ్ రూ. 899 ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ను MyJio యాప్ లేదా Jio అధికారిక వెబ్‌సైట్ నుంచి రూ. 899 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు . ఈ ప్లాన్ తో రీచార్జ్ చేసుకుంటే యూజర్లకు రోజుకు 2 జీబీ హై స్పీడ్ డేటా లభిస్తుంది. అంటే కంపెనీ 90 రోజుల పాటు 180GB డేటా ప్రయోజనాన్ని అందిస్తోంది. ఇది కాకుండా 20GB డేటాను ఉచితంగా వస్తుంది. దీంతో మొత్తం డేటా 200GB పొందొచ్చ. ఇంటర్నెట్ ఎక్కువగా యూజ్ చేసే వారికి ఈ ప్లాన్ బెస్ట్ ఆప్షన్ గా చెప్పొ్చ్చు.

Also Read:Infosys: ఉద్యోగులకు ఇన్ఫోసిస్ షాక్.. ఇకపై ఆఫీసుకు రావాల్సిందే..

ఈ ప్లాన్ తో రీచార్జ్ చేసుకుంటే అపరిమిత కాల్స్ పొందొచ్చు. రోజుకు 100 SMSలు ఉచితంగా పంపుకునే సౌకర్యం కూడా ఉంది. ఈ ప్లాన్‌తో అర్హత కలిగిన కస్టమర్లకు అపరిమిత 5G డేటాను కూడా అందిస్తోంది. ఈ జియో ప్లాన్‌తో , జియోటీవీ, జియోక్లౌడ్ యాప్‌ల ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ అందిస్తోంది. మీరు JioTVలో టీవీ షోలు మొదలైన వాటిని ఆస్వాదించవచ్చు.