ఆన్‌లైన్ గేమింగ్, క్యాసినో, గుర్రపు పందాలపై జీఎస్టీని భారీగా పెంచేందుకు సిద్ధం అవుతోంది జీఎస్టీ కౌన్సిల్.. ఇప్పటి వరకు వాటిపై 18 శాతం జీఎస్టీ ఉండగా.. దానిని 28 శాతానికి పెంచేందుకు రాష్ట్ర ఆర్థిక మంత్రుల ప్యానెల్ ప్రతిపాదనను ఈ వారంలో జరగనున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పరిశీలించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.. మేఘాలయ సీఎం సంగ్మా నేతృత్వంలోని మంత్రుల బృందం, గేమ్‌లో పాల్గొనడానికి ఆటగాడు చెల్లించే ప్రవేశ రుసుముతో సహా, ఆన్‌లైన్ గేమింగ్ పూర్తి విలువతో పన్ను విధించాలని సిఫార్సు చేసింది.. క్యాసినో, ఆన్‌లైన్ గేమింగ్, గుర్రపు పందాలపై 28 శాతం జీఎస్టీ విధించాలని సూచనలు చేసింది.. ఈ నెల 28-29 తేదీల్లో చండీగఢ్‌లో జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో దీనిపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది..
Read Also: Whatsapp: వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. మహిళలకు మాత్రమే
మేఘాలయ సీఎం కన్రాడ్ సంగ్మా నేతృత్వంలో రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన కమిటీ వేయగా.. కీలక ప్రతిపాదలను చేసింది గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీ.. ఆ ప్రతిపాదనలకు జీఎస్టీ మండలి ఆమోద ముద్ర వేసే అవకాశం ఉందని తెలుస్తోంది.. ప్రస్తుతం క్యాసినో, గుర్రపు పందేలు, ఆన్‌లైన్ గేమింగ్‌పై 18 శాతం జీఎస్టీ విధిస్తున్నారు. రేస్ కోర్సుల విషయంలో, టోటలైసేటర్‌లలో పూల్ చేసి బుక్‌మేకర్‌ల వద్ద ఉంచిన బెట్టింగ్‌ల పూర్తి విలువపై జీఎస్టీ విధించాలని.. కాసినోలో ఒక ఆటగాడు కాసినో నుండి కొనుగోలు చేసిన నాణేల పూర్తి విలువపై పన్ను విధించాలని సిఫార్సు చేసింది మంత్రుల కమిటీ… మునుపటి రౌండ్‌లలో గెలిచిన వాటితో సహా, ప్రతి రౌండ్ బెట్టింగ్‌లో ఉంచిన బెట్టింగ్‌ల విలువపై జీఎస్టీ వర్తింపజేయాలని ప్రతినాదలను పంపారు.. అలాగే, కాసినోలలోకి ప్రవేశ రుసుములపై 28 శాతం వస్తువులు మరియు సేవల పన్ను విధించాలని, ఇందులో తప్పనిసరిగా ఆహారాలు/పానీయాలు మొదలైనవాటిని చేర్చాలని జీఎంవో సూచించింది. ఏది ఏమైనప్పటికీ, ప్రవేశ రుసు నుండి.. అన్నింటిపై పన్ను విధించనున్నట్టు తెలుస్తోంది.