NTV Telugu Site icon

Bigg Boss 6: బిగ్‌బాస్ హౌస్‌లో ఎవరు హిట్? ఎవరు ఫ్లాప్?

Bigg Boss 6

Bigg Boss 6

Bigg Boss 6: బిగ్‌బాస్ ఆరో సీజన్ ఐదో వారాంతానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో శనివారం ఎపిసోడ్ హాట్ హాట్‌గా జరిగింది. హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్లతో హౌస్‌లోఎవరు హిట్? ఎవరు ఫ్లాప్? అనే గేమ్ ఆడించారు. ఈ గేమ్‌లో అందరూ తమను సెల్ఫ్ ప్రొటెక్ట్ చేసుకునేందుకు ప్రయత్నించారు. తాము ఆడామని తామే హిట్ అని చెప్పుకున్నారు. తొలుత ఇనయా-సూర్య వచ్చారు. వారిలో సూర్య హిట్, ఇనయా ఫ్లాప్ అని తేలారు. ఇనయాలో జెన్యూనిటీ క‌నిపించ‌లేద‌ని, ఇప్పటికీ ఆమెను తాను అర్థం చేసుకోలేక‌పోతున్నాన‌ని సూర్య చెప్పాడు. హౌస్ మేట్స్ కూడా సూర్యకు మద్దతు తెలిపారు. అటు ఆదిరెడ్డి-గీతూలలో ఆదిరెడ్డి హిట్, గీతూ ఫ్లాప్‌గా తేలారు. చంటి-సుదీపలలో చంటి తనకు తానే సెల్ఫ్ ఫ్లాప్‌గా నిర్ధారించుకున్నాడు. అర్జున్-వాసంతిలలో వాసంతి హిట్, అర్జున్ ఫ్లాప్‌గా హౌస్‌మేట్స్ స్పష్టం చేశారు.

Read Also: NV Prasad: ప్రజారాజ్యం నుంచి పుట్టిన బాధ, ఆవేదనే.. ఈరోజు జనసేన

బాలాదిత్య-రాజ్‌లలో బాలాదిత్య హిట్ అని, రాజ్ ఫ్లాప్ అని.. ఫైమా-మెరీనాలలో మెరీనా హిట్, ఫైమా ఫ్లాప్ అని తేలింది. రోహిత్-కీర్తి భట్‌లలో కీర్తి హిట్ అని.. రోహిత్ ఫ్లాప్ అని వచ్చింది. శ్రీసత్య-శ్రీహాన్‌లలో శ్రీస‌త్య ఫ్లాప్‌, శ్రీహాన్ హిట్ అని హౌస్‌మేట్స్ ఓటు వేశారు. రేవంత్ సింగిల్‌గా మిగిలిపోగా.. అతడిని హిట్ అని తేల్చారు. కాగా ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న వారిలో బాలాదిత్య, వాసంతి సేఫ్ అయ్యారు. ఈ వారం హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారన్న విషయం ఆదివారం ఎపిసోడ్‌లో స్పష్టం కానుంది. అటు ఆదివారం ఎపిసోడ్‌లో సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ స్పెషల్ గెస్టుగా వచ్చి అలరించబోతున్నట్లు ప్రోమోల ద్వారా తెలుస్తోంది.

Show comments