NTV Telugu Site icon

మానస్ – పింకీ మధ్య ఏం జరుగుతోంది!?

బిగ్ బాస్ హౌస్ లోని అందాల సుందరి ప్రియాంక (పింకీ) మేల్ కంటెస్టెంట్స్ చాలామందిని నోరారా ‘అన్నయ్యా’ అని పిలుస్తుంటుంది. అయితే మానస్ అందుకు మినహాయింపు! మొదటి నుండీ మానస్ అంటే కనిపించని ప్రేమ చూపిస్తూ వచ్చిన పింకీ ఆ మధ్య ఓపెన్ అయిపోయింది. అవసరం ఉన్నా లేకపోయినా మానస్ ను ముద్దులతో ముంచెత్తుతోంది. అది చాలదన్నట్టుగా బిగి కౌగిళ్ళతో సేద తీర్చుతోంది. అయితే మానస్ చాలా సందర్భాలలో తన పరిథిని గుర్తించే మెలగుతున్నాడు. పింకీ ఎప్పుడైనా కాస్తంత ఓవర్ అయినా, ఓ గీత గీసి ఆ హద్దు దాటవద్దంటూ ఓ రకంగా వార్నింగ్ ఇస్తున్నాడు. కానీ ప్రియాంక తెలిసో తెలియకో ఆ హద్దుల్ని చెరిపేసే ప్రయత్నం చేస్తోంది.

పింకీ మనస్తత్త్వం గ్రహించిన మానస్ ఆమెకు ఈ మధ్య గట్టిగానే క్లాస్ పీకాడు. ‘నీకు నచ్చని వ్యక్తులను శాపనార్థాలు పెట్టేస్తుంటావ్, ఆవేశంలో నువ్వేం మాట్లాడుతున్నావో కూడా తెలుసుకోవ్, ఈ పద్థతి మార్చుకో’ అని సూటిగానే చెప్పేశాడు. ఆ మాటలకు కాస్తంత హర్ట్ అయినా, ఆ తర్వాత మళ్ళీ మానస్ దగ్గరికి చేరింది పింకీ. అలానే పింకీ విపరీతమైన చేష్టలు చూసి, ‘కంటెంట్ కోసం చేస్తున్నావా?’ అంటూ మానస్ అనడాన్ని మాత్రం ఆమె తట్టుకోలేకపోయింది. ఈ గొడవ చినికి చినికి గాలివానగా మారిపోయింది. తాను బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చినప్పుడు ఎలా ఉన్నానో అలానే ఇక మీద పింకీతో ఉంటానని మానస్ చెప్పాడు. దాంతో కాసేపు కన్నీళ్ళు పెట్టుకున్న పింకీ… సిరి, కాజల్ దగ్గర కాస్తంత సానుభూతిని పోగు చేసుకుంది. ఆ తర్వాత తిరిగి మానస్ దగ్గరకు వెళ్ళి అతని మాటలు తనను చాలా హర్ట్ చేశాయంటూ వాపోయింది. ఇద్దరూ కాసేపు తర్కించుకున్నారు. ఆ తర్వాత పాత గొడవలకు షార్ట్ అవుట్ చేసుకుని, మరోసారి బిగి కౌగిలిలోకి వెళ్ళిపోయారు. దూరం నుండీ ఈ ఘటనను చూసి సన్నీ స్టన్ అయిపోయి, ‘బిగ్ బాస్ హౌస్ లో అందరి ముందూ ఏం జరుగుతోంది!?’ అంటూ కామెంట్ చేశాడు. ఒకటి మాత్రం నిజం! ఇటు పింకీ ఓవర్ యాక్షన్, అటు కాజల్ సెంటిమెంటల్ గేమ్ మధ్య మానస్ నలిగిపోతున్నాడు. తాను చేస్తోంది తప్పో ఒప్పో తేల్చుకోలేని పరిస్థితిలోకి వచ్చేశాడు. మరి ఈ నారీ నారీ నడుమ మురారీ ట్యాగ్ నుండి మానస్ ఎప్పుడు బయటపడతాడో చూడాలి!